Car Driving Tips: పర్వత ప్రాంతాల్లో కారు నడుపుతున్నారా.. ఈ విషయాల గుర్తుంచుకోవడం తప్పనిసరి?
వేసవికాలం వచ్చింది అంటే చాలు పిల్లలు పెద్దలు ఫ్యామిలీలు అందరూ కలిసి వెకేషన్ లోకి వెళ్లాలని ప్లాన్లు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా విడిది కోసం చాల
- By Anshu Published Date - 07:20 PM, Fri - 23 June 23

వేసవికాలం వచ్చింది అంటే చాలు పిల్లలు పెద్దలు ఫ్యామిలీలు అందరూ కలిసి వెకేషన్ లోకి వెళ్లాలని ప్లాన్లు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా విడిది కోసం చాలామంది పర్వత ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే కొందరు ఇందుకోసం వెహికల్స్ ని రెంటుకు తీసుకుంటే మరికొందరు ఓన్ వెహికల్స్ లో ప్రయాణిస్తూ ఉంటారు. ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా ప్రయాణించాలని కోరుకుంటూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉన్న కానీ పర్వత ప్రాంతాలకు వెళ్లాలి అనుకున్నప్పుడు డ్రైవింగ్ విషయంలో కొన్ని రకాల సూచనలు విషయాలు గుర్తుంచుకోవాల్సిందే. లేదంటే ఊహించని పరిణామాలు జరగవచ్చు. కొన్ని కొన్ని సార్లు అది విషాదాలకు కూడా దారితీస్తుంది. అలాకాకుండా కొన్ని విషయాలను పాటించడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది. మరి ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
చాలామంది సరదా కోసం అవసరం లేకపోయినా కారు బ్రేక్‌ను పదేపదే ఉపయోగిస్తుంటారు. కానీ అలా బ్రేక్ ని పదే పదే ఉపయోగించకూడదు. ఇలా చేస్తే కారు బ్రేక్ వేడెక్కుతుంది. దాని పనితీరును ప్రభావితం చేుస్తుంది. బ్రేక్‌కు బదులుగా ఇంజిన్ టెక్నాలజీని ఉపయోగించాలి. పర్వాతల పై వాతావరణం ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో వాతావరణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకుంటూ టూర్ ప్లాన్ చేసుకోవాలి. లేదంటే మార్గమధ్యలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉండచ్చు, తుపాను మధ్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది.అలాగే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం పర్వతాలపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు బ్యాలెన్స్‌ను నిర్వహించడం చాలా అవసరం. కారును నడుపుతున్నప్పుడు వేగాన్ని అదుపులో ఉంచుకోవాలి.
అతివేగంతో వెళితే కారు నియంత్రణ కోల్పోవచ్చు. ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పర్వాతలపై మాత్రమే కాకుండా ఎక్కడైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ముందు, వెనుక వాహనాలకు కాస్త దూరం పాటించాలి. అలా చేయకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దూరం పాటించడం ద్వారా సేఫ్‌గా డ్రైవింగ్ చేయవచ్చు. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ముందు వాహనాలకు కాస్త దూరంగానే ఉండాలి. ఎందుకంటే ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు ముందు వాహనాలు కార్ బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం అదుపుతప్పి వెనక్కి అమాంతం వచ్చేస్తాయి. అటువంటి సమయంలో ఊహించని పరిణామాలు జరుగుతూ ఉంటాయి. చాలా మంది ప్రజలు ప్రయాణ సమయంలో రహదారిపై ఉండే సంకేతాలను గుర్తించరు. కానీ, ఇలా ఎప్పుడూ చేయకూడదు. రహదారిపై సంకేతాలను, హెచ్చరికలను ఎల్లప్పుడూ చూస్తుండాలి. ఆ చిహ్నాలు, గుర్తుల ప్రకారమే వాహనాన్ని నడపాలి.