BYD Atto 3 Electric: అద్భుతమైన మైలేజ్ తో అతి తక్కువ ధరకే లభిస్తున్న లగ్జరీ ఈ-కార్?
ప్రముఖ చైనా కార్ మేకర్ బీవైడీ నెమ్మదిగా భారతీయ మార్కెట్లోకి విస్తరిస్తోంది. ఇప్పటికీ ఈ కంపెనీ నుంచి చాలా రకాల కార్లు భారత మార్కెట్ లోకి విడుదలైన విషయం తెలిసిందే. ఈ కంపెనీ నుంచి మొదలైన ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ కారుకి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ దక్కింది.
- By Anshu Published Date - 08:51 AM, Fri - 12 July 24

ప్రముఖ చైనా కార్ మేకర్ బీవైడీ నెమ్మదిగా భారతీయ మార్కెట్లోకి విస్తరిస్తోంది. ఇప్పటికీ ఈ కంపెనీ నుంచి చాలా రకాల కార్లు భారత మార్కెట్ లోకి విడుదలైన విషయం తెలిసిందే. ఈ కంపెనీ నుంచి మొదలైన ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ కారుకి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ దక్కింది. దీంతో ఇప్పుడు మరో కొత్త కారును భారత్ లో లాంచ్ చేసింది బీవైడీ. 2024 అట్టో 3 ఈవీ పేరుతో ఈ కారుని తీసుకొచ్చింది. కాగా తాజాగా విడుదల అయిన ఈ కార్ మూడు కొత్త వేరియంట్స్ లో లభించనుంది. ఈ లైనప్ లో డైనమిక్, ప్రీమియం, సూపీరియర్ పేర్లతో మూడు వేరియంట్లు ఉన్నాయి.
ఇకపోతే వీటి ధర విషయానికి వస్తే..వీటి ప్రారంభ ధర డైనమిక్ వేరియంట్ రూ. 24.99 లక్షలుగా ఉండగా, గరిష్టంగా సూపీరియర్ వేరియంట్ ధర రూ. 33.99లక్షలుగా ఉంటుంది. ఇకపై ఈ 2024 అట్టో 3 ఈవీ బుకింగ్ విషయానికి వస్తే.. 2024 అట్టో 3 ఈవీ డైనమిక్, ప్రీమియం, సుపీరియర్ వేరియంట్ లు దేశంలోని కస్టమర్ ల అభిరుచికి అనుగుణంగా అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి. అలాగే చాలా కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంది. వినియోగదారులు తమ బుకింగ్ లను రూ. 50,000 టోకెన్ మొత్తంతో చేసుకోవచ్చు. అంతేకాకుండా రాబోయే వారాల్లో డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి. 2024 అట్టో 3 ఈవీ ఫీచర్, సేఫ్టీ అప్‌డేట్‌లు రెండింటినీ అందుకుంటుంది.
మూడు వేరియంట్‌లు పనోరమిక్ సన్‌రూఫ్, 5 అంగుళాల డిజిటల్ డ్రైవ్ డిస్‌ప్లే యూనిట్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే రెండింటికి మద్దతు ఇచ్చే 12.8 అంగుళాల తిరిగే టచ్‌స్క్రీన్ తో కనిపిస్తాయి. సీటింగ్ పరంగా, 6 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు ఆఫర్ లో ఉన్నాయి. మెరుగైన గ్రిప్ కోసం విస్తృత 235/15 ఆర్18 టైర్ లను కలిగి ఉంటుంది. అప్‌డేట్ లలో కొత్త కాస్మోస్ బ్లాక్ పెయింట్ స్కీమ్, క్రోమ్ విండో సరౌండ్‌లు, దాని టెయిల్ గేట్ పై విలక్షణమైన బీవైడీ బ్యాడ్జింగ్ ఉన్నాయి. కొత్త కాస్మోస్ బ్లాక్‌తో పాటు స్కీ వైట్, బౌల్డర్ గ్రే, సర్ఫ్ బ్లూ వంటి నాలుగు రంగు ఎంపికలలో ఈ కారు అందుబాటులో ఉంది. భద్రతకు సంబంధించిన మొత్తం 7 ఎయిర్ బ్యాగ్ లను కలిగి ఉంటుంది. ఇది ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ లతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టీపీఎంఎస్, 360 డిగ్రీ కెమెరా, హిల్ డిసెంట్ కంట్రోల్‌ని కూడా పొందుతుంది. అడాస్ ఫీచర్ ప్రత్యేకంగా టాప్ స్పెక్ సుపీరియర్ ట్రిమ్ లో వస్తుంది. ఇక ఎంట్రీ లెవల్ డైనమిక్ ట్రిమ్‌లో 49.92 కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.
ఇది సింగిల్ చార్జ్ పై 468 కిమీ పరిధిని అందిస్తుంది. ప్రీమియం, సుపీరియర్ రెండు అధిక వేరియంట్‌లు ఒకే ఛార్జ్‌పై 521 కి.మీ శ్రేణిని కలిగి ఉన్న పెద్ద 60.48 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ యూనిట్ లను పొందుతాయి. దీనిలో బ్యాటరీ డీసీ ఛార్జర్ ద్వారా కేవలం 50 నిమిషాల్లో 0-80 శాతం వరకూ ఛార్జ్ అవుతుంది. డైనమిక్ ట్రిమ్ 70 కేడబ్ల్యూహెచ్ డీసీ ఛార్జింగ్ ఎంపికను అందిస్తుంది. అయితే ప్రీమియం, సుపీరియర్ ట్రిమ్‌లు 80కేడబ్ల్యూహెచ్ ఛార్జింగ్ ఎంపికలను సపోర్ట్ చేస్తాయి. డైనమిక్ ట్రిమ్ కేవలం 7.9 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మిగిలిన రెండు వేరియంట్లలో కేవలం 7.3 సెకన్లలోనే ఈ వేగాన్ని అందుకోగలుగుతుంది.బైవైడీ ఇండియా కూడా తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను విస్తరించే ఏర్పాట్లు చేస్తోంది.