HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Bmw India To Hike Car Prices From January 1

BMW India: కార్ల వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. జనవరి నుంచి పెరగనున్న బీఎండబ్ల్యూ కార్ల ధరలు?

మామూలుగా ఒక సంవత్సరం ముగిసి మరొక సంవత్సరం మొదలవుతుంది అంటే చాలు అనేక విషయాలలో కొత్త కొత్త రూల్స్ పాటించాల్సి వస్తూ ఉంటుంది. ఇక కొత్త ఏ

  • Author : Anshu Date : 14-12-2023 - 3:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 14 Dec 2023 03 34 Pm 1065
Mixcollage 14 Dec 2023 03 34 Pm 1065

మామూలుగా ఒక సంవత్సరం ముగిసి మరొక సంవత్సరం మొదలవుతుంది అంటే చాలు అనేక విషయాలలో కొత్త కొత్త రూల్స్ పాటించాల్సి వస్తూ ఉంటుంది. ఇక కొత్త ఏడాదితో పాటు ధరలు కూడా మండిపోతూ ఉంటాయి. నిత్యం మనం ఉపయోగించే వాటిపై ధరలు పెంచేస్తూ ఇప్పటికే నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అందులో భాగంగానే వచ్చే ఏడాది జనవరి నుంచి బీఎండబ్ల్యూ కార్ల ధరలు కూడా పెరగనున్నాయి. మామూలుగా చాలామందికి బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేయాలి అని ఆశ ఉంటుంది.. కానీ ఈ కారు ధర కారణంగా చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. అలాంటిది వచ్చే ఏడాది నుంచి ఈ కారు ధరను మరింత పెంచనుంది BMW సంస్థ.

మరి ఆ వివరాల్లోకి వెళితే.. జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా BMW ఇండియా వచ్చే ఏడాది నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జనవరి 1 నుంచి బీఎండబ్ల్యూ కార్ల ధరలు రెండు శాతం మేర పెరుగుతాయని ప్రకటనలో పేర్కొంది. విదేశీ మారక ద్రవ్య విలువ పెరగడంతో పాటు, నిర్వహణ వ్యయం అధికం కావడంతో ధరలు పెంచక తప్పడం లేదని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పవా తెలిపారు. జనవరి 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. భారత్‌లో బీఎండబ్ల్యూ సంస్థ 220ఐ ఎమ్‌ స్పోర్ట్‌ నుంచి ఎక్స్‌ఎమ్‌ వరకు వివిధ రకాల కార్లను విక్రయిస్తోంది.

వీటి ధరల శ్రేణి రూ.43.5 లక్షల నుంచి రూ.2.6 కోట్ల వరకు ఉంది. ప్యాసింజర్‌ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే మారుతి సుజుకీ, హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా, హోండా, ఆడీ సంస్థలు ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో బీఎండబ్ల్యూ చేరింది. అయితే ఇప్పటికే కొన్ని కార్ల తయారీ సంస్థలు ఈ ఇయర్ ఎండ్ సేల్స్ లో భాగంగా కార్లపై లక్షల్లో ఆఫర్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. కార్లు కొనుగోలు చేయాలి అనుకున్న వారికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి కార్ల ధరలు చాలా వరకు పెరగనున్నాయి. కాబట్టి ఇయర్ ఎండ్ సేల్స్ లో కొనుగోలు చేసే వారికి కార్లపై లక్షల్లో డిస్కౌంట్ లభిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bmw
  • bmw car
  • BMW India
  • Car Price
  • india

Related News

Gas Effect 4yres

War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసినా, దాని తాలూకు ఆర్థిక గాయాలు మానడానికి మరో రెండు నుండి నాలుగేళ్ల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు

  • Hormuz route opened for India

    Hormuz Route : గుడ్ న్యూస్.. భారత నౌకలపై ఇరాన్ గ్రీన్ సిగ్నల్

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

Latest News

  • Google Map : గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి !!

  • MGNREGA : ఉపాధి కూలీలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

  • Crime News: స్కూల్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి..

  • Spam Calls : స్పామ్ కాల్సు తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి..మళ్లీ అలాంటి కాల్స్ ఉండవు !!

  • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd