Bajaj Pulsar: లక్ష రూపాయల లోపు మార్కెట్లో దొరుకుతున్న సూపర్ బైక్స్ ఇవే!
అన్ని వాహనాలల్లో చౌకగా ఉండే వాహనం ద్విచక్ర వాహనం. పెద్ద పెద్ద వాహనాల కంటే ఈ వాహనంను ఎక్కడికైనా తీసుకొని వెళ్లొచ్చు. ఈ ద్విచక్ర వాహనాలు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు.
- By Anshu Published Date - 08:10 AM, Fri - 29 July 22

అన్ని వాహనాలల్లో చౌకగా ఉండే వాహనం ద్విచక్ర వాహనం. పెద్ద పెద్ద వాహనాల కంటే ఈ వాహనంను ఎక్కడికైనా తీసుకొని వెళ్లొచ్చు. ఈ ద్విచక్ర వాహనాలు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా యువత మాత్రం ఇందులో చాలా రకాల మోడల్స్ చూస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో మాత్రం హోండా, హీరో, బజాజ్, టీవీఎస్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
బైకు కొనాలనుకునే ప్రతి ఒక్కరు అనుకూలమైన రేటుతో పాటు మంచి మైలేజ్ ని చూసుకుంటారు. దీంతో అనుకూలమైన ధరలో అంటే లక్ష రూపాయల లోపు దొరికే వాహనాలు కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందా..

Honda sp 125
హోండా ఎస్పీ 125. ఈ వాహనం ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజక్షన్ తో కూడిన BS6 కంప్లైంట్ 125 సిసి ఇంజన్ తో పనిచేస్తుంది. దీని అందుబాటు ధర రూ. 82,243.

Hero Glamour
హీరో గ్లామర్. ఇది 124.7 సిసి ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ బైకు ధర రూ.78,753.

Honda Shine
హోండా షైన్ అనే ఈ వాహనం 124 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ తో పని చేస్తుంది. దీన్ని ప్రారంభ ధర రూ.77,338.

Hero Super Splendor
హీరో సూపర్ స్ప్లెండర్ అనే ఈ బైకు 124.7 సిసి ఇంజన్ తో పనిచేస్తుంది. దీని ధర రూ. 77,939.

Tvs Raider 125
ఇక టీవీఎస్ రైడర్ 125 ఈ బైకు 124.8 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, త్రీ వాల్వ్ ఇంజన్ తో పనిచేస్తుంది. దీని ధర రూ.88,078.

Bajaj Pulsar 125
చివరిగా బజాజ్ పల్సర్ 125 అనే బైకు 124.4 సిసి, ఎయిర్ కూల్డ్, డిటిఎస్ఐ ఇంజన్తో పనిచేస్తుంది. దీని ధర రూ.82,712.