Chat GPT In Cars : ఈ కార్ల స్టీరింగ్‌లో ‘ఛాట్ జీపీటీ’ ఫీచర్.. ఇక ఎంతో కంఫర్ట్
Chat GPT In Cars : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) యుగమిది. ఏఐ చాట్‌బాట్లకు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు.
- By Pasha Published Date - 03:08 PM, Fri - 12 January 24

Chat GPT In Cars : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) యుగమిది. ఏఐ చాట్‌బాట్లకు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ప్రఖ్యాత ఏఐ చాట్‌బాట్ చాట్ జీపీటీ గురించి తెలియనిది ఎవరికి !! టెస్లా వంటి పలు కార్ల కంపెనీలు ఇప్పటికే ఏఐని వినియోగంలోకి దూసుకుపోతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి కార్ల తయారీ దిగ్గజం వోక్సవ్యాగన్ కూడా ఎంటరైంది. ఓపెన్ ఏఐ కంపెనీ తయారు చేసిన చాట్ జీపీటీని(Chat GPT In Cars) తన కార్లలో పరిచయం చేసేందుకు వోక్సవ్యాగన్ రెడీ అవుతోంది. కార్లలోని ఛాట్ జీపీటీ సర్వీసు సాయంతో ఎయిర్ కండీషనర్ వర్కింగ్ లెవల్స్‌ను అడ్జస్ట్ చేయడం, వాయిస్ కమాండ్లను ఇవ్వడం వంటివి చేయొచ్చు. కేవలం నోటి మాటతోనే ఈ టాస్క్ అంతా పూర్తి అయిపోతుంది.
We’re now on WhatsApp. Click to Join.
- చాట్ జీపీటీ ఫీచర్ వల్ల వోక్స్ వ్యాగన్ కార్లలో త్వరలోనే అలెక్సా తరహా వాయిస్ అసిస్టెంట్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగిన ఒక ఆటోమొబైల్ షోలో కంపెనీ ప్రదర్శించింది. ఈ ఏడాది జూన్‌లోగా ఈ ఫీచర్ వోక్స్ వ్యాగన్ కార్లలో అందుబాటులోకి వచ్చేస్తుంది. తొలి విడతలో నార్త్ అమెరికా, యూరోప్‌లోని కస్టమర్లకు ఈ ఫీచర్‌ను అందిస్తారు.
- ప్రస్తుతం కారులో ఏసీ ఆన్ చేయడం దగ్గరి నుంచి మ్యూజిక్ ప్లే ఆన్ చేయడం దాకా అన్నీ డ్రైవర్ తన చేతులతోనే చేయాల్సి వస్తోంది. త్వరలో చాట్ జీపీటీ వచ్చేస్తే వాయిస్ అసిస్టెంట్ మన మాటలు విని ఆ పనులను కారులో చక్కబెడుతుంది.
- వోక్స్ వ్యాగన్‌కు చెందిన టైగ్వాన్, పస్సాట్, గోల్ఫ్ మోడల్స్‌తో పాటు ఎలక్ట్రిక్ వాహనాల్లో చాట్ జీపీటీ ఫీచర్‌ను తీసుకురానున్నారు. ఈ ఫీచర్ కారు స్టీరింగ్‌లో ఉంటుంది. జస్ట్ హలో ఐడీఏ అని పలికితే.. వెంటనే ఏఐ చాట్ బాట్ యాక్టివేట్ అయిపోతుంది. మీకు కావాల్సిన సాయం చేస్తుంది.
- వోక్స్‌వ్యాగన్ కంపెనీ తన కార్లలో చాట్ జీపీటీ ఫీచర్‌ను యాడ్ చేసేందుకు థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్ ఇంటిగ్రేషన్ కంపెనీ సెరెన్స్‌తో జట్టు కట్టింది. ఈ సాఫ్ట్‌వేర్ ఏఐ ఆధారిత ఫీచర్ల వినియోగాన్ని సింప్లిఫై చేస్తుంది.
Also Read: 1100 Jobs : ఈసీఐఎల్‌లో 1100 జాబ్స్.. జూనియర్ టెక్నీషియన్స్‌కు గ్రేట్ ఛాన్స్
“చాట్ జీపీటీ వాడడం ప్రారంభించిన దగ్గరి నుంచి నేను దానికి కొంత బానిసనయ్యా” అని ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ ఇటీవల అన్నారు. అదానీ మాత్రమే కాదు ప్రపంచమంతా ప్రస్తుతం చాట్ జీపీటీ గురించే చర్చ జరుగుతోంది. లాంచ్ అయిన మూడు నెలల్లోనే మిలియన్ల మంది యూజర్లు దీనిని వినియోగిస్తున్నారు. దీంతో టెక్నాలజీ రంగంలో ఇదో సంచలనంగా మారింది. చాట్ జీపీటీని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. సెర్చ్ ఇంజిన్ గూగుల్‍కు కూడా ఈ ఏఐ చాట్ బాట్ ‘చాట్ జీపీటీ’ సవాలు విసురుతోంది. ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ తీసుకొచ్చిన ఈ చాట్ జీపీటీ టెక్ రంగంలో పెనుమార్పులకు కారణమవుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.