Ola Offers: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పైన రూ.49,000 తగ్గింపు ఆఫర్లు!
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వారికి హోలీ ఫెస్టివ్ ఆఫర్లు అదిరిపోయాయి. భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు పరిమిత కాలం వరకే ఉంటాయి.
- By Maheswara Rao Nadella Published Date - 08:00 PM, Wed - 8 March 23

ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ అదిరే ఆఫర్లు తీసుకువచ్చింది. కొత్తగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (Scooter) కొనాలని భావించే వారికి భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఓలా (Ola) ఎలక్ట్రిక్ హోలీ పండుగ సందర్భంగా కస్టమర్ల కోసం డిస్కౌంట్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటి వాటిని అందిస్తోంది. ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
పాత పెట్రోల్ బైక్ లేదా స్కూటర్ ఎక్స్చేంజ్ చేస్తే.. గరిష్టంగా రూ. 45 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. దీనికి ఈ హోలీ ఆఫర్లు అదనం. కస్టమర్లు ఓలా ఎస్ వేరియంట్‌పై రూ.2 వేల తగ్గింపు పొందొచ్చు. అలాగే ఓలా ఎస్ 1 ప్రో మోడల్‌పై అయితే రూ. 4 వేల వరకు తగ్గింపు ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద లభించే రూ. 45 వేల తగ్గింపుకు ఇది అదనం. అంతేకాకుండా కస్టమర్లు ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ద్వారా రూ. 6,999 వరకు ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు పొందొచ్చు.
ఓలా (Ola) అలాగే కమ్యూనిటీ మెంబర్లకు ఓలా కేర్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్, ఎక్సెంటెడ్ వారంటీస్‌పై 50 శాతం తగ్గింపు అందిస్తోంది. కాగా ఈ ఆఫర్లు అన్నీ మార్చి 12 వరకే ఉంటాయి. ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్సూల్ ఖండేల్‌వాలా మాట్లాడుతూ.. ఓలా హోలీ ఆఫర్ల ద్వారా కస్టమర్లు ప్రయోజనం పొందొచ్చని తెలిపారు. తాజా ఆఫర్లతో పండుగ ఆనందం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుకు చౌక వడ్డీ రేటుతో రుణాలు పొందొచ్చు. వడ్డీ రేటు 8.99 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. ఇంకా జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ ఉంది. అలాగే క్రెడిట్ కార్డు ద్వారా కొంటే అదనపు తగ్గింపు ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. కాగా మీరు ఎంచుకునే మోడల్ ప్రాతిపదికన మీకు లభించే ఆఫర్లు కూడా మారతాయని గుర్తించుకోవాలి.
కాగా ఓలా కేర్ సర్వీసుల్లో రెండు రకాల ప్లాన్స్ ఉంటాయి. ఓలా కేర్ ఒకటి. ఓలా కేర్ ప్లస్ మరొకటి. ఓలా కేర్ ప్లాన్ ద్వారా ఫ్రీ లేబర్ సర్వీర్, థెఫ్ట్ అసిస్టెన్స్, రోడ్ సైడ్ అసిస్ట్, పంచర్ అసిస్ట్ వంటి సేవలు పొందొచ్చు. అదే ఓలా కేర్ ప్లస్ విషయానికి వస్తే.. యాన్వల్ కాంప్రెహెన్సిల్ డయాగ్నస్టిక్, ఫ్రీ అంబులెన్స్, ఫ్రీ హోమ్ సర్వీస్, పికప్ అండ్ డ్రాప్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు.
Also Read: Tomato Soup: ఈ టమాటో సూప్ తో జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందండి.

Related News

Tata Nano Solar Car: ఎలక్ట్రిక్ కాదు.. సీఎన్జీ కాదు.. సోలార్ టాటా నానో కారు.. రూ.30కే 100 కి.మీ మైలేజ్
ఇది మామూలు టాటా నానో కారు కాదు.. సౌర శక్తితో నడవడం దీని స్పెషాలిటీ.. ఇందులో 100 కి.మీ జర్నీ చేయడానికి కేవలం రూ.30 మాత్రమే ఖర్చవుతాయి.