Kawasaki: కవాసకి నింజా 650 బైక్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
ఐరో స్పేస్ కంపెనీ అయిన కవాసకి ఇప్పటికే ఎన్నో రకాల మోటార్ సైకిల్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం
- By Nakshatra Published Date - 03:10 PM, Wed - 16 November 22
ఐరో స్పేస్ కంపెనీ అయిన కవాసకి ఇప్పటికే ఎన్నో రకాల మోటార్ సైకిల్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా కవాసకి భారత మార్కెట్ లోకి స్పోర్ట్స్ బైక్ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త వెర్షన్ బైకులను ఆవిష్కరించింది. 2023 కవాసకి నింజా 650 బైక్ ని భారత మార్కెట్ లోకి తీసుకువచ్చింది. అయితే ఇప్పటికే నింజా మిడ్ లెవల్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్ లో మార్కెట్లో మాంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సరికొత్తగా తీర్చి దిద్ది స్పోర్టీ డిజైన్, కొత్త ఫీచర్లు, అప్డేట్స్తో కొత్త కవాసాకి 2023 నింజా 650ని లాంచ్ చేసింది.
కాగా తాజాగా విడుదల చేసిన ఈ బైక్ లైమ్ గ్రీన్ కలర్ లభించునుంది. 2023 కవాసాకి నింజా 650 బైక్ ఫీచర్ల విషయానికి వస్తే.. స్పోర్ట్స్ బైక్ లుక్ లో తీసుకొచ్చిన ఈ బైక్ లో 649 సీసీ పార్లల్ ట్విన్ ఇంజన్‌ను జత చేసారు. కాగా ఇది 8,000 ఆర్ పిఎం వద్ద 68 పవర్‌ను, 6,700 ఆర్ పిఎం వద్ద 64 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే విండ్‌షీల్డ్‌ను కొత్తగా డిజైన్ చేసింది. కొత్త డిజిటల్ TFT కలర్ ఇన్స్ట్రుమెంటేషన్, కాక్‌పిట్‌కు హై టెక్ అలాగే హై గ్రేడ్ లుక్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ లో ఇచ్చిన ఈ బ్లూటూత్ టెక్నాలజీ తో రైడర్లు తమ బైక్‌ను వైర్లెస్ గా కూడా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.
ఇకపోతే ఈ 2023 కవాసకి నింజా 650 బైక్ ధర విషయానికి వస్తే.. భారత్ లో ఈ బైక్ ధరను రూ.7.12 లక్షలు ఎక్స్-షోరూమ్ గా ఉంది.కాగా ఇప్పటికే ఈ కొత్త నింజా 650 బైక్ బుకింగ్‌లు మొదలు కాగా,డెలివరీలు అతి త్వరలోనే మొదలుపెట్టనున్నారు. 2023 కవాసకి నింజా 650 బైక్ గ్రీన్ కలర్ లో ఉండి చూడడానికి ఒక స్పోర్ట్స్ బైక్ లాగా అదిరిపోయే లుక్ తో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన బుకింగ్స్ మొదలు కావడంతో వినియోగదారులు పెద్ద ఎత్తున బుకింగ్స్ చేసుకుంటున్నారు.
Related News
ICC Rankings: టెస్టుల్లో నంబర్ ర్యాంక్ కోల్పోయిన టీమిండియా …
అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ శుక్రవారం మూడు ఫార్మాట్ల (టెస్ట్, వన్డే మరియు టి20 ఇంటర్నేషనల్) వార్షిక ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. ఇందులో భారత జట్టు టెస్టు నంబర్-1 స్థానాన్ని కోల్పోయింది.