HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Strange Weather In Andhra Pradesh Sunny In Some Districts Rains In Some Districts

Strange Weather : ఏపీలో వెరైటీ వాతావరణం.. కొన్ని జిల్లాల్లో ఎండలు.. కొన్ని జిల్లాల్లో వర్షాలు

Strange Weather : ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం వెరైటీగా ఉంది.

  • Author : Pasha Date : 09-03-2024 - 11:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Weather Update
Weather Update

Strange Weather : ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం వెరైటీగా ఉంది. ఉత్తర ఒడిశా నుంచి ఉత్తర కోస్తా ఆంధప్రదేశ్, యానాం వరకు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో ఒక ద్రోణి వెళ్తోంది. సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో దక్షిణ ఒడిశా, పొరుగున ఉన్న తుఫాన్ ప్రసరణ ఎగువ ద్రోణితో కలిసిపోయింది. సగటున సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో తెలంగాణ పొరుగు ప్రాంతాలపై తుఫాన్ సర్క్యులేషన్‌ ఉంది. ఈ ప్రభావంతో ఇవాళ, రేపు (శని, ఆదివారాల్లో) అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉంది.

We’re now on WhatsApp. Click to Join

శుక్రవారం రోజు విభిన్న వాతావరణం(Strange Weather)  కనిపించింది. మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట, గుమ్మలక్ష్మీపురంతో పాటూ ఇతర ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ వేడి కనిపించింది. అయితే శుక్రవారం సాయంత్రం కల్లా ఆకాశం మేఘావృతమైంది. మెల్లగా చల్లగాలులు వీయగా.. ఉన్నట్టుండి వర్షం కురిసింది. భామిని, పార్వతీపురంలోనూ ఓ మోస్తరు వర్షం కురిసింది. కొద్ది రోజులుగా ఎండ వేడి, ఉక్కబోతకు అల్లాడిన ఆయా ప్రాంతవాసులు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. జీడి, మామిడికి ఈ వాన మేలు చేస్తుందని ఆయా రైతులు చెబుతున్నారు. అయితే చింతపండు, కొండచీపుర్లుకు మాత్రం నష్టం తప్పదని ఆయా ప్రాంత వాసులు వాపోతున్నారు.

Also Read : Group 1 Prelims : రేపటి నుంచే గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు.. 17న ఎగ్జామ్

రాయలసీమలో భానుడు భగ్గుమంటున్నాడు. ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత కనిపిస్తోంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకంటే రాయలసీమలో టెంపరేచర్స్ సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. విశాఖపట్నం, కళింగపట్నం మినహా అన్ని ప్రాంతాల్లో 33 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ, ఉత్తర కోస్తాల్లో రాయలసీమ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డవుతుండటం కాస్త ఊరటనిస్తోంది. సాధారణంగా ఏప్రిల్‌ ప్రారంభం నుంచి 40 డిగ్రీలు, అంతకుమించి పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది అందుకు భిన్నంగా మార్చి ఆరంభంలోనే టెంపరేచర్స్  41 డిగ్రీలు దాటేస్తున్నాయి.

Also Read : CSK: ఐపీఎల్ 2024కు ముందు సీఎస్కే జ‌ట్టుకు బిగ్ షాక్ త‌గ‌ల‌నుందా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Weather
  • Rainy Weather
  • Strange Weather
  • Sunny Weather

Related News

Massive public meeting on the alliance's two-year rule

Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శుక్రవారంతో రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, గత వైసీపీ ప్రభుత్వం మిగిల్చి వెళ్లిన సవాళ్లు, సంక్షోభాలను అధిగమించి, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబు తన అభిప్రాయాలను పంచుకున్నా

  • Zomato gets Rs 9.6 crore GST demand from Andhra Pradesh

    Zomato: జొమాటో కు షాక్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 9.6 కోట్ల జీఎస్‌టీ నోటీసు

  • That is the very day the 'Thalliki Vandanam' money gets credited!

    Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

  • Centre sanctions massive funds for AP: Union Minister Pemmasani Chandra Sekhar

    Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

  • Central government showering blessings on Amaravati

    Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

Latest News

  • Venkateswara Suprabhatam: వేంకటేశ్వర సుప్రభాతం చరిత్ర తెలుసా?

  • Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

  • Prakash Raj: ధర్మస్థల కేసులో ప్రకాష్ రాజ్ పేరు

  • Meenakshi Natarajan: సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్‌

  • Nara Lokesh: రాయలసీమలో రత్నాలు పడేలా చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు: మంత్రి నారా లోకేష్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd