Gudivada Amarnath : విజయసాయి రెడ్డి పై అమర్నాథ్ ఫైర్
Gudivada Amarnath : జగన్మోహన్ రెడ్డిపై విజయసాయి చేసిన విమర్శలు ఆయన మారిన ధోరణిని స్పష్టంగా చూపిస్తున్నాయని అమర్నాథ్ అన్నారు
- By Sudheer Published Date - 11:43 AM, Thu - 13 March 25

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్యలపై పార్టీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) ఘాటుగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డిపై విజయసాయి చేసిన విమర్శలు ఆయన మారిన ధోరణిని స్పష్టంగా చూపిస్తున్నాయని అమర్నాథ్ అన్నారు. “ఎవరిపై ప్రేమ పుట్టిందో, మరొకరిపై మనసు విరుగుతోంది. జగన్ 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే విజయసాయి ఇలాగే మాట్లాడేవారా?” అంటూ ఆయన ప్రశ్నించారు.
KL Rahul: కేఎల్ రాహుల్ తండ్రి అయ్యాడా? నిజమిదే!
విజయసాయిరెడ్డి వ్యవసాయం చేయరని, రాజకీయమే చేస్తారని ఆయన స్వయంగా చెప్పుకున్నట్టేనని అమర్నాథ్ విమర్శించారు. రాజకీయాల్లో మార్పులు సహజమైనప్పటికీ, గతంలో జగన్‌కు అండగా నిలిచిన విజయసాయి, ఇప్పుడు ఆయనపై విమర్శలు చేయడం వెనుక ఏమున్నదో ప్రజలకు అర్థమవుతోందని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోయిన తర్వాత కొందరు తమ స్వార్థప్రయోజనాల కోసం వైసీపీని విమర్శిస్తున్నారని, ఇది బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
Gold And Silver Rate: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి మెల్లగా దూరమవుతున్న సంకేతాలు గత కొంతకాలంగా కనిపిస్తున్నప్పటికీ, ఆయన తాజా వ్యాఖ్యలు ఆ ఊహాగానాలను మరింత బలపరిచాయి. అమర్నాథ్ వంటి నేతలు విజయసాయి విమర్శలను ఖండించడం చూస్తే, వైసీపీ లోపలే విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపై విజయసాయి-వైసీపీ మధ్య సంబంధాలు ఎలా మారతాయనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.