Somu Veerraju : కేంద్రం ఇస్తున్న నిధులను కూడా సొంత ఖాతా నుంచి ఇస్తున్నట్లు డబ్బా కొడుతున్నారు..!!
జగన్ సర్కార్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. బటన్ నొక్కడమే పనిగా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు.
- By hashtagu Published Date - 01:56 PM, Tue - 16 August 22

జగన్ సర్కార్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. బటన్ నొక్కడమే పనిగా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిధులను కూడా సొంత ఖాతా నుంచి ఇస్తున్నట్లుగా బటన్ నొక్కుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి శూన్యం అన్నారు. జగన్ సర్కార్ అన్ని విధాలుగా విఫలమయ్యిందన్నారు. వైసీపీ బుర్రలేని ప్రభుత్వంలా వ్యవహరిస్తోందని సోమువీర్రాజు ఎద్దేవా చేశారు.
ఇక విజయవాడలోని నేచర్ క్యూర్ హాస్పటల్ కు గత ప్రభుత్వం భూమిని ఇచ్చిందని…ఆ భూమిని వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పేరుతో నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్రానికి కేంద్రం 35 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే…ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయాలేదన్నారు. ఏపీకి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. ఈనెల 21న విజయవాడలో భారీ బహిరంగసభను నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఆ సభలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడమే లక్ష్యంగా సభను నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.