AP : జగన్ కుటుంబంలో ఆసక్తికర పరిణామాలు.. అండగా మేం ఉన్నాం – మేనత్త వైఎస్ విమలా రెడ్డి
- By Sudheer Published Date - 01:41 PM, Tue - 30 January 24

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జగన్ (CM Jagan)కుటుంబంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా మేనల్లుడు జగన్ కు బాసటగా మేనత్త వైఎస్ విమలా రెడ్డి (YS Vimala Reddy) నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వర్గాలను సమీకరించే విధంగా ఆమె కసరత్తు చేస్తున్నారు. విజయవాడలో పాస్టర్లతో సమావేశాన్ని చేపట్టింది వైఎస్ విమలమ్మ. దాదాపు 26 జిల్లాల నుంచి పలువురు ఫాస్టర్లు హాజరయ్యారు.
సీఎం జగన్ మేనత్త వైఎస్ విమలమ్మ మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం పేదలు అందరికీ మేలు చేస్తుంది అని తెలిపారు. ఇవన్నీ ఇలాగే కొనసాగాలి అంటే ఈ ప్రభుత్వమే మళ్ళీ రావాలి అని కోరారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా జగన్ ఉన్నారు అని భరోసా ఇవ్వటం కూడా దీనిలో భాగమేనని తెలిపారు. ప్రధానంగా పాస్టర్ల ప్రార్ధనలు, సహకారం మాకు చాలా అవసరం అని తెలిపారు. జగన్ వెంట ఉండటం కుటుంబ సభ్యురాలిగా నా బాధ్యత అన్నారు. దేవుడి దయ ఉంటే విజయమ్మ(Vijayamma) కూడా జగన్ కోసం వస్తారు అని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇది ఇలా ఉండగా.. కడప జిల్లాలో ప్రతిపక్షాల సహకారంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేయనున్నారని సోషల్ మీడియాలో, ఆర్కే మీడియాలో పేర్కొనడం జరిగిందని రఘురామకృష్ణ రాజు( Raghu Rama Krishna Raju) తెలిపారు. ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సమాధిని రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వై.యస్. షర్మిల రెడ్డి గారు సందర్శించారని, ఈ సందర్భంగా ఇడుపులపాయలో డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి గారిని ఆమె కలుసుకున్నారని, రానున్న ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానానికి, పులివెందుల అసెంబ్లీ స్థానానికి గట్టి అభ్యర్థులనే బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయని, దాని పర్యవసానాలు తీవ్రంగానే ఉంటాయని భావించవచ్చునని అన్నారు.
దెబ్బతిన్న ఇద్దరు ఆడ కూతుళ్లు శివంగుల్లా పోరాడే అవకాశం ఉందని, త్వరలోనే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపించారో కూడా తెలిసిపోతుందని అనుకుంటున్నానని అన్నారు. ఆరు నెలలుగా హైకోర్టులో అజయ్ కల్లం రెడ్డి గారు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రావడం లేదని, ప్రతి శుక్రవారం పిటిషన్ విచారణ జాబితాలో ఉన్నప్పటికీ, విచారణకు నోచుకోవడం లేదని, పిటిషన్ దాఖలు చేసిన వారే విచారణ చేపట్టాలని కోరాల్సి ఉందని, కానీ వారు అటువంటి ప్రయత్నం చేయకపోవడం చూస్తుంటే, ఇదో రకమైన కోర్టు క్రాఫ్ట్ అని అర్థమవుతుందన్నారు.
Read Also : Rajya Sabha Elections : తెలంగాణలో కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1 రాజ్యసభ సీట్లు..?