YS Sharmila Package Star : షర్మిల ను కూడా ప్యాకేజ్ స్టార్ ను చేసిన వైసీపీ
- Author : Sudheer
Date : 27-01-2024 - 9:55 IST
Published By : Hashtagu Telugu Desk
మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ప్యాకేజ్ స్టార్ (Package Star)..ప్యాకేజ్ స్టార్ అంటూ ఆరోపించిన వైసీపీ (YCP) నేతలు..ఇప్పుడు APCC చీఫ్ వైఎస్ షర్మిల (Sharmila) ను కూడా అలాగే అనడం స్టార్ట్ చేసారు. ప్రస్తుతం వైసీపీ పార్టీ లో అలజడి రేపుతోంది షర్మిల..గత ఎన్నికల్లో జగన్ వదిలిన బాణం అంటూ ప్రజల్లోకి వెళ్లిన షర్మిల..ఇప్పుడు సోనియా వదిలిన బాణం గా ప్రజల ముందుకు వచ్చింది. APCC చీఫ్ గా బాధ్యతలు తీసుకోవడం ఆలస్యం వైఎస్ షర్మిల..తన అన్నపై పగ తీర్చుకునే పనిలోపడింది. తన అన్న ఎంత మోసం చేసాడో పబ్లిక్ గా చెపుతూ ప్రజలను తన వైపు తెప్పుకుంటుంది. ఓ పక్క కాంగ్రెస్ విధివిధానాలు చెపుతూనే..మరోపక్క కాంగ్రెస్ నేతలను , వైస్ అభిమానులను దగ్గర చేసుకుంటూ కాంగ్రెస్ కు మళ్లీ ప్రాణం పొసే పనిలో పడింది. రోజు రోజుకు షర్మిల హావ ఎక్కువ అవుతుండడం.,..జగన్ ఫై విమర్శలు ఎక్కువ చేస్తుండడం తో..వైసీపీ నేతలు సైతం షర్మిల ఫై ఎదురుదాడికి దిగడం మొదలుపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
జగన్ కూడా పరోక్షంగా షర్మిల ఫై విమర్శలు చేయడం మొదలుపెట్టేసరికి..పార్టీ లో ఉన్న చిన్న , చితక నేతలు సైతం షర్మిల ఫై దూకుడు పెంచుతున్నారు. మొన్న ఉరవకొండ సభ లో జగన్..షర్మిల ను చంద్రబాబు కు కాంపెయిన్ అంటే..నేడు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..షర్మిలను ప్యాకేజ్ స్టార్ అంటూ విమర్శలు చేసారు. చంద్రబాబు మాయలో షర్మిల మరో ప్యాకేజీ స్టార్ అవుతారని దుయ్యబట్టారు. ఏపీని చీల్చిన కాంగ్రెస్తో షర్మిల చేతులు కలిపారన్నారు. సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను అమలు చేశారని , వైసీపీ తీసుకొచ్చే మేనిఫెస్టోలో విపక్షాలు కొట్టుకుపోతాయని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటె ఈరోజు షర్మిల మూడు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆమె సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు. జిల్లాల పర్యటనతో గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వారిని యాక్టివ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కష్టపడితే ఎన్నికలలో మంచి ఫలితాలు సాదించవొచ్చని తెలుపుతుంది.
Read Also : Supreme Court: న్యాయమూర్తుల మధ్య వివాదం.. సుప్రీంకోర్టుకు చేరిన పంచాయతీ