HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Sharmila Comments On Ys Jagan In Chintapalli Meeting In Alluri District

YS Sharmila : జగన్ పులి కాదు.. బీజేపీ ముంగిట పిల్లి – షర్మిల

  • Author : Sudheer Date : 10-02-2024 - 7:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sharmila Jagan Cat
Sharmila Jagan Cat

వైసీపీ అధినేత , ఏపీ సీఎం , తన అన్న జగన్ (Jagan) ఫై వైస్ షర్మిల (YS Sharmila) తన దూకుడు ను తగ్గించడం లేదు..ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి వైసీపీ ప్రభుత్వం ఫై విమర్శలు , ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం జిల్లాల పర్యటన లో బిజీ గా ఉంటూ..మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తుంది. ఓ పక్క అధికార పార్టీ వైసీపీ ఫై విమర్శలు చేస్తూనే..మరోపక్క కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం నింపుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

శనివారం అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లిలో వైఎస్ షర్మిల బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ వేదికగా మరోసారి వైసీపీ సర్కార్ ఫై , జగన్ ఫై విమర్శల వర్షం కురిపించింది. సీఎం జగన్ పులి కాదని.. బీజేపీ ముంగిట పిల్లిలా మారారని షర్మిల ఎద్దేవా చేశారు. ‘బీజేపీ గుప్పిట్లో జగన్ చిక్కుకున్నారు. ప్రత్యేకహోదా కోసం ఆయన ఎప్పుడైనా నిజమైన పోరాటం చేశారా? 25 వేల పోస్టులతో DSC అన్నారు. ఇప్పుడు తూతూమంత్రంగా ఎన్నికల ముంగిట DSC ప్రకటించారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేకహోదా, పోలవరం, రాజధాని సాధ్యం’ అని ఆమె పేర్కొన్నారు. అలాగే టీడీపీపైనా షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. బ్రిటిష్ వాళ్ళను తరిమి తరిమి కొట్టిన వీరుడు మన్యందొర అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిగా.. అల్లూరి బ్రిటీష్ వాళ్లను తరిమికొట్టినట్లు, నియంతలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

వైఎస్ఆర్ హయాంలో 20 లక్షల ఎకరాలకు పోడుపట్టాలు ఇచ్చామని, వాటి ద్వారా రైతులు లోన్లు కూడా తీసుకున్నట్లు షర్మిల గుర్తుచేశారు. వైఎస్ఆర్ హయాంలో వేసిన రోడ్లే ఇప్పటికీ దిక్కు అన్న షర్మిల.. ఇప్పటి ప్రభుత్వాలకు బాక్సైట్ తవ్వకాల మీద ఉన్న శ్రద్ధ గిరిజనుల అభివృద్ధి మీద లేదని విమర్శించారు. జగనన్న 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారనీ.. కానీ అధికారంలోకి వచ్చాక చేతకాలేదని తప్పుబట్టారు. ఎన్నికలప్పుడు ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోవాలన్న షర్మిల.. అవి మీడబ్బులే. ఇసుక, బాక్సైట్‌, లిక్కర్‌ మాఫియాతో సంపాదించిన డబ్బులే.. కానీ, ఓటు మాత్రం ఆలోచించి వేయండని ప్రజలను కోరింది.

Read Also : Telangana Budget 2024: కాంగ్రెస్ బడ్జెట్ పై కేటీఆర్ పంచులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alluri district
  • Chintapalli Meeting
  • congress
  • ys sharmila

Related News

Chikkamagaluru Farmers

Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న‌.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం

చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న చేప‌ట్టారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. చిక్కమగళూరు లో మాత్రం బీన్స్ వ్యాపారులు అత్యంత తక్కువ ధ‌ర‌ల‌కు కొంటున్నార‌ని రైతులు ఆరోపించారు. శనివారం రాత్రి చిక్కమగళూరులోని ఏపీఎంసీ యార్డు వద్ద వందలాది మంది రైతులు భారీ నిరసన చేపట్టి..ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం వేశారు. ఈ విష‌యంపై జిల్లా యంత్రాంగం తక్షణమే జ

    Latest News

    • Road Accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    • HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు

    • AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

    • ‘Oota’ Restaurant : హైటెక్ సిటీలో ‘ఊట’ రెస్టారెంట్ ప్రారంభం!

    • Girl Missing : టెక్నాలజీతో మిస్సింగ్ బాలిక ఆచూకీ.. 25 నిమిషాల్లో గుర్తించిన ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd