YS Sharmila : ఛలో సచివాలయం..చెల్లిని అరెస్ట్ చేయించిన అన్న
- Author : Sudheer
Date : 22-02-2024 - 4:29 IST
Published By : Hashtagu Telugu Desk
షర్మిల (YS Sharmila) తలపెట్టిన ఛలో సచివాలయం (Chalo Secretariat) ఉద్రిక్తతకు దారితీసింది. గతంలో వైసీపీ సర్కార్ చెప్పిన 23 వేల పోస్టుల మెగా డీఎస్సీ హామీని నిలబెట్టుకోకుండా కేవలం 6000 పోస్టులతో డీఎస్సీ ప్రకటన చేయడాన్ని నిరసిస్తూ గురువారం కాంగ్రెస్ పార్టీ ఛలో సచివాలయం కార్యక్రమం చేపట్టింది. ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల తో పాటు మిగతా నాయకులతో కలిసి ఆంధ్రరత్న భవన్ నుంచి సచివాలయంవైపు వెళ్తుండగా.. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు . దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిలను మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే అరెస్ట్ చేసే సమయంలో షర్మిల చేతికి స్వల్ప గాయాలయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఛలో సెక్రటేరియట్ ను అడ్డుకునేందుకు పోలీసులు నిన్న రాత్రి నుంచే కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకోవడం మొదలుపెట్టారు. దీన్ని గమనించిన షర్మిల విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లోనే రాత్రి బస చేశారు. ఉదయం విజయవాడ నుంచి సచివాలయానికి షర్మిల పాదయాత్రగా బయలుదేరారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి షర్మిల చేపట్టిన పాదయాత్ర..ఏలూరు రోడ్డు మీదుగా చల్లపల్లి బంగ్లా వద్దకు చేరుకుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి షర్మిల మానవహారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన వేలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలని, నాయకుల్ని విడుదల చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నేతలతో కలిసి వైఎస్ షర్మిల సెక్రటేరియట్ కు బయలుదేరారు. దీంతో గుంటూరు జిల్లా సీతానగరం కొండవీటి వాగు ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు.
Read Also : Bikes Under 3 Lakh: రూ. 3 లక్షల కంటే తక్కువ ధరకే లభించే స్పోర్ట్స్ బైక్‌లు ఇవే..!