YS Jagan: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.. వైసీపీ అధినేత జగన్ ట్వీట్!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఆగడాలు ఎక్కువయ్యాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) ఆరోపించారు.
- Author : Gopichand
Date : 18-07-2024 - 11:36 IST
Published By : Hashtagu Telugu Desk
YS Jagan: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఆగడాలు ఎక్కువయ్యాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) ఆరోపించారు. తాజాగా గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన హత్యపై ఆయన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ద్వారా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జగన్ ట్వీట్‌లో ఏం రాశారంటే.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
Also Read: Kalki 2898 AD : ‘కల్కి’తో ప్రభాస్ సరికొత్త రికార్డ్.. ఏంటో తెలుసా..?
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు,…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 18, 2024
దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రి శ్రీ మోదీగారికి, హోంమంత్రి శ్రీ అమిత్‌షాగారికి విజ్ఞప్తిచేస్తున్నాను. వైయస్సార్‌సీపీ కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాను. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని జగన్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.