HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Andhra Pradesh News
  • ⁄Ys Family Participated In Ysr Vardhanti In Idupulapaya

YSR Vardhanthi : ఇడుపుల‌పాయ వేదిక‌గా మూగ‌సైగ‌లు

స్వ‌ర్గీయ డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 13వ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఇడుపుల‌పాయ వ‌ద్ద ఆయ‌న కుటుంబం ఒకే ఫ్రేమ్ లో క‌నిపించింది.

  • By Hashtag U Updated On - 02:38 PM, Fri - 2 September 22
YSR Vardhanthi : ఇడుపుల‌పాయ వేదిక‌గా మూగ‌సైగ‌లు

స్వ‌ర్గీయ డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 13వ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఇడుపుల‌పాయ వ‌ద్ద ఆయ‌న కుటుంబం ఒకే ఫ్రేమ్ లో క‌నిపించింది. ఎవ‌రికివారే ఇడుపుల‌పాయ‌కు విడివిడిగా వెళ్లిన‌ప్ప‌టికీ ఒకే టైంకు వైఎస్ ఘాట్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. తొలుత ష‌ర్మిల ఆ త‌రువాత జ‌గ‌న్ రావ‌డం క‌నిపించింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల‌, వైఎస్ భార‌తి మ‌ధ్య మూగ‌సైగ‌లు కనిపించ‌డం గ‌మ‌నార్హం.

ప్రార్థ‌న చేసే స‌మ‌యంలో జ‌గ‌న్‌, ష‌ర్మిల ప‌క్క‌ప‌క్క‌నే కూర్చొన్నారు. అయిన‌ప్ప‌టికీ ఒక‌రు మొఖాలు మ‌రొక‌రు చూసుకోలేదు. అయితే, ప్రార్థ‌న చేయ‌డానికి ఒక ప‌త్రాన్ని వైఎస్ విజ‌య‌మ్మ ష‌ర్మిల‌కు అంద‌చేసింది. మ‌రో ప‌త్రాన్ని జ‌గ‌న్ కు ఇవ్వాల‌ని ష‌ర్మిల‌కు ఇచ్చారు. ఆ ప‌త్రాన్ని జ‌గ‌న్ కు ఇవ్వ‌డానికి ష‌ర్మిల ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఆయ‌న సున్నితంగా తిర‌స్క‌రించిన దృశ్యం వాళ్ల మ‌ధ్య ఉన్న విభేదాల‌కు అద్దం ప‌డుతోంది. స‌మాధి వ‌ద్ద‌కు వ‌స్తోన్న సంద‌ర్భంగా భార‌తికి అభివాదం చేసే ప్ర‌య‌త్నం ష‌ర్మిల చేశారు. కానీ, భార‌తి నుంచి ఎలాంటి రియాక్ష‌న్ రాక‌పోవ‌డంతో సమాధి వ‌ద్ద‌కు నేరుగా వెళ్లి కూర్చున్నారు.

గ‌త రెండేళ్లుగా కుటుంబం మొత్తం ఒకేచోట క‌నిపించ‌క‌పోవ‌డం వైసీపీ శ్రేణుల‌కు ఒకింత లోటుగా ఉంది. కానీ, ఈ ఏడాది ఇడుపులపాయ వ‌ద్ద జ‌రిగిన వ‌ర్థంతి సంద‌ర్భంగా కుటుంబమంతా ఒకేచోట క‌నిపించింది. ఒక‌రికొక‌రు ప‌లుక‌రించుకోక‌పోయిన‌ప్ప‌టికీ ఒకే చోట సామూహిక ప్రార్థ‌న‌ల‌ను నిర్వ‌హించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి జగన్, విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిళ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వీరంతా ప్రత్యేక ప్రార్థనల్లో కూడా పాల్గొన్నారు.

తండ్రిని తలచుకుంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. ‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశ చరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటి చెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది’ అని ట్వీట్ చేశారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి 1949 జులై 8న కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించారు. 1978లో వైఎస్సార్ రాజకీయ అరంగేట్రం చేశారు. 1978, 1983, 1985 లో పులివెందుల శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా వ‌రుసగా గెలుపొందారు. ఆ త‌రువాత 1989, 1991, 1996, 1998 లో కడప లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పార్ల‌మెంట్లోకి అడుగుపెట్టారు. రాష్ట్ర రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టిన వైఎస్ 1999, 2004, 2009 లో పులివెందుల నుంచి విజయం సాధించారు. 2004 నుంచి ఐదేళ్ల మూడు నెలల పాటు ఉమ్మ‌డి ఏపీకి సీఎంగా పని చేశారు. 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ క్రాష్ ఘటనలో దుర్మరణం చెందారు.

వైఎస్సాఆర్ వ‌ర్థంతికి ఇడుపులపాయ వెళ్లిన జ‌గ‌న్ శుక్ర‌వారం విడతల వారీగా సాయంత్రం వరకు పులివెందుల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. స్థానిక నేతలు, అధికారులు హాజరుకానున్నారు.

Tags  

  • idupulapaya
  • YS Jagan Mohan Reddy
  • ys rajasekhar reddy
  • ys sharmila
  • ys vijayamma
  • ysr vardhanthi

Related News

Vizag Capital : జగన్ విశాఖ కల, ఈ సారి బలమైన ముహూర్తం

Vizag Capital : జగన్ విశాఖ కల, ఈ సారి బలమైన ముహూర్తం

జగన్ విశాఖ పాలన కల నెరవేరడం లేదు. విశాఖ పీఠం స్వామి ముహూర్తం ఫలించటం లేదు. ఈ సారి ఉగాదికి బాగా గట్టి ముహూర్తం పెట్టారట. వి

  • AP Employees : ఉద్యోగ సంఘం నేతకు జగన్ మార్క్ తీర్పు?బండి తడాఖా

    AP Employees : ఉద్యోగ సంఘం నేతకు జగన్ మార్క్ తీర్పు?బండి తడాఖా

  • BJP Election Plan : కేసీఆర్, జగన్ అప్పులు, బీజేపీ ఎన్నికల అస్త్రం అదే..!

    BJP Election Plan : కేసీఆర్, జగన్ అప్పులు, బీజేపీ ఎన్నికల అస్త్రం అదే..!

  • YS Sharmila Attacks BJP: షర్మిల దూకుడు.. బీజేపీ పై అవినీతి అస్త్రాలు!

    YS Sharmila Attacks BJP: షర్మిల దూకుడు.. బీజేపీ పై అవినీతి అస్త్రాలు!

  • Baahubali Sketch : తెలంగాణ‌లో జ‌గ‌న్ స‌భ‌లు? అన్న‌ద‌మ్ముల అనుబంధం!

    Baahubali Sketch : తెలంగాణ‌లో జ‌గ‌న్ స‌భ‌లు? అన్న‌ద‌మ్ముల అనుబంధం!

Latest News

  • IT Raids: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు.. ఉదయం నుంచి సోదాలు.!

  • Gold And Silver Price Today: బంగారం ధరలు ఇలా.. వెండి ధరలు అలా..!

  • Shooting At Nightclub: మెక్సికోలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి

  • Electric Bike: మేడ్ ఇన్ హైదరాబాద్ ఎలక్ట్రిక్ బైక్.. ధర, ఫీచర్స్ ఇవే?

  • Minister Roja: ఏపీ మంత్రి రోజాకు అరుదైన అవకాశం.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సభ్యురాలిగా నియామకం

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: