AP Govt : చంద్రబాబు ప్రభుత్వం పై యంగ్ హీరో ప్రశంసలు
AP Govt : ఇలాంటి విపత్తు వస్తే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్, ప్రజలందరూ కలిసి చాలా కృషి చేశారు
- Author : Sudheer
Date : 29-09-2024 - 9:10 IST
Published By : Hashtagu Telugu Desk
విజయవాడ వరదల్లో (Vijayawada Floods) ప్రభుత్వం బాగా పనిచేసిందని హీరో నిఖిల్ (హీరో Nikhil) కొనియాడారు. ఓ ఈవెంట్ కోసం మంగళగిరి వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు (Chandrababu) సర్కార్ పై ప్రశంసలు జల్లు కురించారు. ‘అందరి కోసం అమరావతి’ (Andari Kosam Amaravathi) పేరుతో నిర్వహించిన 10కే, 5కే, 3కే రన్‌ను ఆదివారం హీరో నిఖిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. జీవన శైలిలో మార్పులే వ్యాధులకు కారణమని అన్నారు. అందరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. మంగళగిరి నియోజకవర్గాన్ని మంత్రి నారా లోకేశ్ ఒక మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. రోడ్లు, లైటింగ్, శుభ్రత, పరిసరాలు చాలా బాగున్నాయని , విజయవాడకు వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు అద్భుతంగా పనిచేశారని వెల్లడించారు.
‘ఇలాంటి విపత్తు వస్తే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్, ప్రజలందరూ కలిసి చాలా కృషి చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి హాట్సాఫ్’ అని పేర్కొన్నారు. ఇక నిఖిల్ సినీ కెరియర్ విషయానికి వస్తే ..హ్యాపీ డేస్ తో హీరోగా పరిచమైన నిఖిల్..ఆ తర్వాత విభిన్న కథలతో ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్యనే కార్తికేయ 2 తో నేషనల్ అవార్డు సైతం అందుకున్నారు. ప్రస్తుతం కార్తికేయ 3 కోసం సిద్ధం అవుతున్నారు.
Read Also : TIrumala Laddu – Sit Enquiry : కీలక డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు