Adala Prabhakara Reddy : వైసీపీని వీడడం ఫై ఆదాల ప్రభాకర్‌రెడ్డి క్లారిటీ..
- By Sudheer Published Date - 10:34 AM, Wed - 17 January 24

ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీ..గత ఎన్నికల్లో ఎలాగైతే భారీ మెజార్టీ తో విజయం సాధించామో..ఈసారి కూడా అలాగే విజయం సాధించాలని సీఎం జగన్ (CM Jagan) చూస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ అభ్యర్థుల విషయంలో అనేక మార్పులు , చేర్పులు చేస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండడం తో చాలామంది నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు టికెట్ రాకపోవడం తో టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా..మరికొంతమంది ఇదే బాటలో నడవబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా నెల్లూరు ఎంపీ, నెల్లూరు రూరల్ వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి (Adala Prabhakara Reddy)..వైసీపీ ని వీడుతున్నారని, ఎంపీగా ఉన్న ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇష్టంలేదని అందుకే ఆయన టీడీపీ లోకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. ఈ తరుణంలో ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానేగానీ.. ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
తాను పార్టీ మారుతున్నట్లు విపక్షాలు, రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి.. తాను టీడీపీ పెద్దలను కలిసినట్లు, ఆ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు.. తనకు వైసీపీలో ఎలాంటి ఇబ్బంది లేదన్న ఆయన.. వైఎస్ జగన్.. తనకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో గెలిచి సేవలు అందించాను.. ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించి పార్టీ తనకు తగిన గుర్తింపునిచ్చిందన్నారు. ఇంత ప్రాధాన్యం ఇస్తున్న వైసీపీని వదిలి వెళ్లాల్సిన అవసరం తనకు ఏంటి? అని నిలదీశారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే సత్తా లేక.. కొందరు కిరాయి మూకలను నియమించుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Read Also : Konaseema coconut : అయోధ్య రాముడికి మండపేట ‘కల్యాణ’ కొబ్బరి బోండాలు..