Chandrababu Naidu : చంద్రబాబు ఏ క్షణమైన జైలుకెళ్లడం ఖాయం.. వైసీపీ మంత్రి సంచలన కామెంట్స్..
స్కిల్ డవలప్‌మెంట్ కేసులో సీఐడీ చంద్రబాబును అరెస్టు చేయడం ఖాయమట. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Karumuri Nageswara Rao) చెప్పారు.
- Author : News Desk
Date : 22-05-2023 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీ సీఎం, టీడీపీ(TDP) జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఏ క్షణమైన జైలుకెళ్తాడట. స్కిల్ డవలప్‌మెంట్ కేసులో సీఐడీ చంద్రబాబును అరెస్టు చేయడం ఖాయమట. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Karumuri Nageswara Rao) చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. చంద్రబాబు రైతు పోరుబాటలో రైతులు లేరు, లోకేశ్ యువగళంలో యువకులు లేరంటూ ఎద్దేవా చేశారు. గోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడారంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తడిసిన ధాన్యంతో పాటు, మొలకలు వచ్చిన ధాన్యం కొనుగోలు చేశారని రైతులే చెబుతున్నారు. కానీ, చంద్రబాబు వచ్చి డ్రామాలు ఆడుతున్నాడు. చంద్రబాబు వల్ల అయ్యేది ఏమీలేదు.. ఆయన డ్రామాలు చేయడం తప్ప రైతులకు ఎలాంటి న్యాయం చేయలేదు, చేయలేడు. జగన్ ప్రభుత్వం హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారంటూ మంత్రి చెప్పారు. చంద్రబాబు నీకు బీసీలు అంటే ఎందుకంత ద్వేషం అంటూ మంత్రి కారుమూరి ప్రశ్నించారు. బీసీ మంత్రికి తద్దినాలు పెడతాం అన్నారు. పెద్ద కర్మలు పెడతాం అన్నాడు.. బీసీలు అంటే చంద్రబాబుకి ద్వేషం రోజురోజుకు పెరుగిపోతుందని, బీసీలు వచ్చే ఎన్నికల్లోనూ సరియైన గుణపాఠం చెబుతారంటూ మంత్రి హెచ్చరించారు.
చంద్రబాబును చూస్తే ప్రేతకళ వచ్చేస్తుందంటూ మంత్రి ఎద్దేవా చేశారు. కరోనా టైంలో చంద్రబాబు సహా ప్రతిపక్ష పార్టీలు కలుగులో ఎలుకల మాదిరిగా దాక్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి కరోనాను ధైర్యంగా ఎదుర్కొన్నారు. దీనిని బట్టి అర్థమవుతుంది చంద్రబాబుకు ప్రజల బాగోగులకంటే ఆయన బాగోగులే ముఖ్యం అని. దీనిని ప్రజలు గుర్తించారని, గత ఎన్నికల్లోలా మరోసారి చంద్రబాబు పరాభవం తప్పదని మంత్రి జోస్యం చెప్పారు. ఎన్టీఆర్కి భారతరత్న ఇస్ లక్ష్మీ పార్వతి అందుకుంటుందని చంద్రబాబు ఏనాడు కేంద్రాన్ని భారతరత్న అడగలేదని, ఎన్టీఆర్ బ్రతికినప్పుడు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాతకూడా వెన్నుపోటు పొడుస్తున్నాడంటూ మంత్రి విమర్శించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని జగన్ కేంద్రాన్ని కోరతాడని చెప్పాడు. లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కిపెడుతున్నారు. పప్పుని పైకి తేవాలనే చంద్రబాబు తాపత్రయం వృథానే అవుతుందని మంత్రి అన్నారు.
Also Read : Kollu Ravindra : పేర్ని నాని కొడుకుని ప్రమోట్ చేయడానికే ఈ సభ.. కొల్లు రవీంద్ర కామెంట్స్..