AP’s Development : ఏపీ అభివృద్ధికి వైసీపీ అడ్డుగోడ
AP's Development : సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ యువత ఆశలపై నీళ్లు జల్లేందుకు చూస్తున్నారు. కానీ ప్రజలు వీరి మాటలు, ప్రచారం నమ్మే స్థితిలో లేరు
- By Sudheer Published Date - 05:17 PM, Mon - 21 April 25

మీము అభివృద్ధి (AP’s Development ) ఏపీ అభివృద్ధికి వైసీపీ (YCP) అడ్డుగోడ చేయలేదు..మీరు చేయొద్దు అనే తీరుగా ఉంది వైసీపీ తీరు. ఐదేళ్ల పాటు అధికారం వైసీపీ కి ప్రజలు అప్పగిస్తే రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా చేసారు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుంటే…దానికి అడ్డు తగులుతున్నారు. దీంతో ప్రజలు వైఎస్సార్సీపీ నేతల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జిల్లాకో పార్టీ కార్యాలయం, ప్యాలెస్ కోసం వేల ఎకరాల భూములను వెతుక్కుంటూ తిరిగిన వైసీపీ నాయకులు, ప్రజలకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు, ఐటీ సంస్థలకు భూములు కేటాయిస్తే మాత్రం గగ్గోలు పెడుతున్నారు. ఒకవైపు అభివృద్ధికి అడ్డుగోడలుగా మారుతూ, మరోవైపు అవినీతి రాజకీయాలకు దారితీస్తూ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ఆయన అంత్యక్రియలు ఎలా చేస్తారంటే?
గత ప్రభుత్వ హయాంలో ఐటీ రంగానికి దెబ్బతీసిన జగన్ ప్రభుత్వం, పెట్టుబడిదారుల్ని భయబ్రాంతులకు గురిచేసారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంస్థలపై అనవసరంగా అనుమానాలు వ్యక్తం చేసి, వారికి సహకరించకుండా పక్క రాష్ట్రాలకు తరిమేశారు. పెట్టుబడులు పెట్టాలన్నా, పరిశ్రమలు నెలకొల్పాలన్నా, మొదట ప్రభుత్వ ప్రోత్సాహం, భద్రత, పారదర్శకత అవసరం. కానీ అవినీతి పాలనతో రాష్ట్రం పేరు చెడిపోయి, ఏ ఒక్క సంస్థ కూడా రావాలన్న ఉత్సాహం లేకుండా పోయేలా చేసారు.
AESL : జెఈఈ మెయిన్స్ 2025 ( సెషన్ 2 ) లో తెలంగాణ రాష్ట్ర టాపర్‌గా ఆకాష్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితులు పూర్తిగా మారాయి. పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఐటీ సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, వేగవంతంగా భూ కేటాయింపులు చేపట్టింది. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో టీసీఎస్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉప్పాడలో డేటా సెంటర్, మధురవాడలో ఐటీ క్యాంపస్ కోసం భూములు కేటాయించి, ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది. ఇది యువతకు వేలాది ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా అడుగులేస్తోంది. దీనిని వైసీపీ నేతలకు జీర్ణించుకోవడం లేదు. తమ పాలనలో సాధించలేనిదాన్ని కూటమి 11 నెలల్లో సాధించడంతో అసూయ, బాధ తట్టలేకపోతున్నారు. ప్రజల శ్రేయస్సు కన్నా పార్టీ గౌరవమే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తూ, అభివృద్ధికి ప్రతిద్వందిగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ యువత ఆశలపై నీళ్లు జల్లేందుకు చూస్తున్నారు. కానీ ప్రజలు వీరి మాటలు, ప్రచారం నమ్మే స్థితిలో లేరు. అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్లే ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసం పెంచుకుంటున్నారు.