Nagari Politics : రోజా అడ్డాలో వర్గపోరు..ముదిరిన ఫ్లెక్సీ వార్
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. వైసీపీ ఎమ్మెల్యే రోజాకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో సొంతపార్టీ నేతలే ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
- Author : Hashtag U
Date : 21-12-2021 - 11:46 IST
Published By : Hashtagu Telugu Desk
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. వైసీపీ ఎమ్మెల్యే రోజాకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో సొంతపార్టీ నేతలే ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.దీంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా పుత్తూరు పట్టణంలో సీఎం జగన్ జన్మదినం వేడుకలను పురస్కరించుకొని ప్రధాన రహదారికి ఇరువైపులా ఎమ్మెల్యే రోజా ప్రత్యర్థి వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిన గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ధ్వంసం చేశారు.

Nagari1
అయితే దీనికి నిరసనగా రోజా ప్రత్యర్థులు ఆందోళనకు దిగారు. తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే రోజానే ధ్వంసం చేయించారని వారు ఆరోపించారు. నగరిలో రోజా దౌర్జన్యాలను అరికట్టాలనే నినాదాలతో హోరెత్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులను అడ్డుకుని… అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.