YCP : సజ్జల చేతికి వైసీపీ..నిజామా..?
YCP : ప్రస్తుతం వైసీపీలో పూర్తి అధికారం సజ్జల రామకృష్ణారెడ్డికి వెళ్లినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది
- By Sudheer Published Date - 07:43 AM, Mon - 3 February 25

వైసీపీ పార్టీకి నమ్మకమైన నేతగా ఉన్న విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) రాజీనామా చేయడంతో పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విజయసాయిరెడ్డిని నమ్ముకుని ఉన్న అనేక మంది నేతలు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆయన మద్దతుతో ఎదిగిన వారు ఇక తమ భవిష్యత్తుపై అనిశ్చితిలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీలో పూర్తి అధికారం సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy)కి వెళ్లినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి నుంచీ తన వర్గాన్ని మాత్రమే ప్రోత్సహించిన సజ్జల, స్టేట్ కోఆర్డినేటర్‌గా మారిన తర్వాత మరింత పట్టు పెంచుకున్నారు. పార్టీ కీలక నిర్ణయాల్లో విజయసాయిరెడ్డి వర్గాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, తనకు అనుకూలంగా ఉన్న వారినే పదవులు ఇచ్చుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు.
ISROs 100th Mission : ఇస్రో 100వ ప్రయోగం ఫెయిల్.. కక్ష్యలోకి చేరని ‘ఎన్‌వీఎస్-02’ శాటిలైట్
విజయసాయిరెడ్డి గతంలో వైసీపీలో నెంబర్ టూ లాగా వ్యవహరించారు. అనేక మంది నేతలు, కార్యకర్తలు ఆయన ఆధ్వర్యంలో పదవులు పొందారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి వెళ్లిపోయిన నేపథ్యంలో వారందరికీ పార్టీ భవిష్యత్తు అనిశ్చితంగా మారిపోయింది. కనీసం 30 శాతం మంది వైసీపీ నేతలు ఆయన మద్దతుతో ఎదిగారని, ఇప్పుడు వారిని సజ్జల పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని అంటున్నారు. ఇకపై జగన్ వద్ద సజ్జల ఒక్కరే ప్రధాన సలహాదారుగా మిగిలిపోయినట్లు కనిపిస్తోంది. సజ్జల తన నిర్ణయాలను జగన్ ద్వారా అమలు చేయిస్తూ, పార్టీపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఆయన మదిలో ఏది ఉంటే, అదే నిర్ణయంగా మారుతున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నారు. విజయసాయిరెడ్డి లేనంత మాత్రాన వైసీపీ బలహీనపడుతుందా లేదా, అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ, పార్టీ ఆపద్ధర్మ బాధ్యతలు పూర్తిగా సజ్జల ఆధీనంలోకి వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరి సజ్జల చేతికి వైసీపీ వెళ్తే..ఎలా ఉంటుందో చూడాలి.