HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Isros 100th Mission Hits A Thruster Snag Desired Orbit Not Achieved

ISROs 100th Mission : ఇస్రో 100వ ప్రయోగం ఫెయిల్.. కక్ష్యలోకి చేరని ‘ఎన్‌వీఎస్‌-02’ శాటిలైట్‌

ఆ శాటిలైట్‌లోని ఇంజిన్లలోకి ఆక్సిడైజర్‌ను పంపి, వాటిని యాక్టివేట్(ISROs 100th Mission) చేయాల్సి ఉంటుంది.

  • By Pasha Published Date - 07:11 AM, Mon - 3 February 25
  • daily-hunt
Isros 100th Mission Nvs 02 Navigation Satellite 02 Navic

ISROs 100th Mission : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జనవరి 29న 100వ ప్రయోగం చేసింది. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ప్రయోగం విజయవంతంగానే జరిగినప్పటికీ, ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరలేదు.  ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు జనవరి 29 నుంచి ఇప్పటివరకు ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Also Read :CM Chandrababu : ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలి.. బీజేపీ అభ్యర్ధుల గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలి

ఎందుకు ఫెయిల్ అయింది ?

ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్‌లో ఉన్న ఇంజిన్లు మొరాయించడం వల్లే,  దాన్ని నిర్దేశిత కక్ష్యలోకి పంపలేకపోయారని తెలిసింది. ఆ శాటిలైట్‌లోని ఇంజిన్లలోకి ఆక్సిడైజర్‌ను పంపి, వాటిని యాక్టివేట్(ISROs 100th Mission) చేయాల్సి ఉంటుంది. ‘ఆన్’ మోడ్‌లోకి తేవాల్సి ఉంటుంది. అయితే ఆక్సిడైజర్‌ను శాటిలైట్‌లోని ఇంజిన్లలోకి చేరవేసే వాల్వ్‌లు తెరుచుకోలేదు. దీంతో ఇంజిన్లు పనిచేసే అవకాశం లేకుండాపోయింది. దీంతో ప్రస్తుతం ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం భూఅనువర్తిత బదిలీ కక్ష్య (జీటీవో)లో పరిభ్రమిస్తోంది. ఈ కక్ష్యలో శాటిలైట్ పరిభ్రమిస్తే నేవిగేషన్‌ వ్యవస్థ కార్యకలాపాల నిర్వహణకు పనికిరాదు. శాటిలైట్ ఇంజిన్లలోకి ఆక్సిడైజర్‌ను పంపేందుకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. భారతదేశ స్వదేశీ ఉపగ్రహ ఆధారిత నేవిగేషన్‌ వ్యవస్థలో ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం చాలా ముఖ్యమైంది.

Also Read : Health Tips : రాత్రిపూట వైఫై ఆఫ్ చేయకుండా నిద్రపోతున్నారా? ఈ సమస్యలు రావచ్చు.!

ఏమిటీ ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్ ?

ఎన్‌వీఎస్‌-02.. నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థతో కూడిన శాటిలైట్. దీన్ని మన  ఇస్రో శాస్త్రవేత్తలే తయారు  చేశారు. భారతదేశం అభివృద్ధి చేసిన కొత్తతరం నావిగేషన్‌ ఉపగ్రహాల్లో ఇది రెండోది. ఈ శాటిలైట్ భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్‌ సేవలకు ఉపయోగపడుతుంది. మన దేశ విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలను తీరుస్తుంది. భారత్‌తో పాటు భారత్ సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల పరిధి వరకూ కచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్‌ పరికరాల్లో లొకేషన్‌ ఆధారిత సేవలను ఇది అందిస్తుంది. ఈ ఉపగ్రహం పదేళ్ల పాటు సేవలు అందించే కెపాసిటీని కలిగి ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • isro
  • ISROs 100th Mission
  • NavIC
  • Navigation Satellite 02
  • NVS 02

Related News

Satellite CMS

Satellite CMS: అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం ప్రయోగానికి కౌంట్‌డౌన్!

మీడియా నివేదికల ప్రకారం.. జియోస్టేషనరీ ఆర్బిట్‌లోకి చేరుకున్న తర్వాత కమ్యూనికేషన్ శాటిలైట్ మిషన్-03 రాబోయే ఏడు సంవత్సరాల వరకు భారతదేశ రక్షణకు తన సహకారాన్ని అందిస్తుంది.

  • Isro Baahubali New

    Isro : మరో భారీ ప్రయోగానికి ఇస్రో సిద్ధం

Latest News

  • Inspections : BRS నేతల ఇళ్లలో తనిఖీలు.. ఉద్రిక్తత

  • Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సరికొత్త రికార్డు!

  • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

  • Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్

  • Cough: ద‌గ్గుతో ఇబ్బందిప‌డుతున్నారా? అయితే ఈ క‌షాయం ట్రై చేయండి!

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd