YCP : వైసీపీ నుండి మరో లిస్ట్ అంటూ ఫేక్ న్యూస్ వైరల్..
- By Sudheer Published Date - 07:58 PM, Fri - 22 December 23

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) పార్టీలో మార్పులు , చేర్పులు చేస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల మార్పు ఫై దృష్టి సారించారు. నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఫై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని వారిని మార్చేస్తున్నారు. ఈసారి దాదాపు 100 మందికి పైగా టికెట్స్ ఇవ్వడం లేదని తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయాన్నీ ఆయా నేతలకు చెప్పడం మొదలుపెట్టారు. వీరిలో మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 11 నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మార్చేయడం జరిగింది. మరికొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మార్చబోతుందని వార్తలు ప్రచారం జరుగుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ తరుణంలో ఓ ఫేక్ ప్రెస్ నోట్ వైరల్ గా మారడం ఫై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 8 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చినట్లు ఓ ఫేక్ ప్రెస్ నోట్ (Fake Press Note) లో అభ్యర్థుల మార్పు తాలూకా వివరాలు తెలిపారు. వారిలో ఎవరెవరు ఉన్నారంటే..
- మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను కాకినాడ రూరల్ ఇంచార్జ్
- ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు ఇంచార్జ్
- జగ్గంపేట ఇంచార్జ్‌గా మాజీ మంత్రి తోట నర్సింహం
- పిఠాపురం నియోజకవర్గానికి కాకినాడ ఎంపీ వంగా గీతను ఇంచార్జుగా
- రామచంద్రపురం నియోజకవర్గం నుంచి తోట త్రిమూర్తుల్ని
- పాయకరావు పేట నియోజకవర్గానికి.. పెడవటి అమ్మాజీని ఇంచార్జిగా
- రాజమండ్రి సిటీ నుంచి ఎంపీ మార్గాని భరత్ కు సీటు కేటాయించారు.
- రాజోలు నియోజకవర్గానికి అమ్మాజీని ఇంచార్జ్ గా నియమించినట్లు ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియా లో వైరల్ కావడం తో అది చూసిన వారంతా నిజమే కావొచ్చని మాట్లాడుకోవడం షేర్ చేయడం మొదలుపెట్టారు. దీనిని గమనించిన వైసీపీ అధిష్టానం..ఇది ఫేక్ ప్రెస్ నోట్ అని , జనసేన , టీడీపీ పార్టీలు కలిసి చేస్తున్న కుట్ర అని విమర్శలు చేసింది. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది.
ఛీ మీ బతుకులు చెడ @JaiTDP @JanasenaParty దద్దమ్మల్లారా… ఎన్నాళ్ళైనా మీ బతుకులు మారవా. మా మీద విషం చల్లి, మాపై తప్పుడు కథనాలు రాసి, ఫేక్ వార్తలు క్రియేట్ చేయడమేనే మీ జీవితం.మా పార్టీ గురించి మీకెందుకురా. మీ సంగతి, మీ పొత్తులు, మీ పార్టీ వ్యవహారాల గురించి చూసుకోండి ముందు. ఇప్పటికే… pic.twitter.com/MyPDWby3Sx
— YSR Congress Party (@YSRCParty) December 22, 2023
Read Also :