Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించిన మహిళా వాలంటీర్.. పరువు నష్టం కేసు నమోదు..
తాజాగా విజయవాడ సివిల్ కోర్టులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ పరువు నష్టం(Defamation) కేసు నమోదైంది. పవన్ పై ఓ మహిళా వాలంటీర్ కేసు ఫైల్ చేసింది.
- By News Desk Published Date - 08:00 PM, Mon - 24 July 23

ఇటీవల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వరుసగా ఏపీ వాలంటీర్ల(AP Volunteers)పై చేసిన వ్యాఖ్యలు ఏపీలో రచ్చగా మారాయి. ప్రభుత్వం, వాలంటీర్లు పవన్ పై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల పవన్ కళ్యాణ్ పై ఈ విషయంలో కేసులు నమోదు అయ్యాయి. తాజాగా విజయవాడ సివిల్ కోర్టులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ పరువు నష్టం(Defamation) కేసు నమోదైంది. పవన్ పై ఓ మహిళా వాలంటీర్ కేసు ఫైల్ చేసింది.
వాలంటీర్ తరపున న్యాయవాదులు కేసు దాఖలు చేశారు. సెక్షన్స్ 499, 500, 504, 505 red with 507,511 of ipc ప్రకారం కేసు దాఖలు చేసి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు. పవన్ పై చర్యలు తీసుకోవాలని మహిళా వాలంటీర్ కోరింది.
అనంతరం ఆ మహిళా వాలంటీర్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. పవన్ తప్పుడు ఆరోపణలు చేశారు. ఉమెన్ ట్రాఫికింగ్ ఆరోపణలు అవాస్తవం. నేను భర్త చనిపోయి పిల్లలతో జీవిస్తున్నాను. వాలంటీర్ జాబ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాను. పవన్ వ్యాఖ్యల తర్వాత నన్ను చుట్టుపక్కల వారు ప్రశ్నించారు. ఉమెన్ ట్రాఫికింగ్ అంశాలపై కొందరు నన్ను ప్రశ్నించారు. నిస్వార్ధంగా సేవ చేస్తున్న మాపై నిందలు వేసి పవన్ తప్పు చేశారు. పవన్ కళ్యాణ్ ను చట్టపరంగా శిక్షించాలి అని తెలిపింది.
ఆ మహిళా వాలంటీర్ తరపు న్యాయవాదులు మాట్లాడుతూ.. బాధితురాలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల మనోవేదనకు గురైంది. కోర్టును ఆశ్రయించిన తర్వాత కచ్చితంగా విచారణ జరుగుతుంది. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కు కోర్టు నోటీసులు ఇస్తుంది. పవన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది కోర్టు. పవన్ వ్యాఖ్యలు కుట్ర పూరితంగా ఉన్నాయి. వాలంటీర్లలో అధికశాతం మహిళలు ఉన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్ కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్ కు చెప్పి ఉంటే ఆ ఆధారాలను కోర్టుకు వెల్లడించాలి. ప్రభుత్వానికి సహాయకులుగా ఉన్న వాలంటీర్ల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదు. అబద్ధపు వదంతులు, వ్యాఖ్యలు చేసి ప్రజలను రెచ్చగొట్టి వాలంటీర్లపై తిరగబడేలా వ్యాఖ్యలు చేసిన పవన్ పై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తిని కోరాం అని తెలిపారు.
Also Read : New party secret : చంద్రబాబు చతురతపై జగన్ హైరానా! BCYP రహస్య కోణం.!!