Chandrababu : చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ బిగ్ షాక్ తగలబోతుందా..?
మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది
- Author : Sudheer
Date : 22-04-2024 - 6:40 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఎన్నికల సమయం (Election Time) దగ్గర పడుతున్నకొద్దీ..అక్కడి రాజకీయాలు (AP Politics) రసవత్తరంగా మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు తమ వ్యూహాలకు మరింత పదును పెడుతూ ముందు వెళ్తున్నాయి. ముఖ్యంగా కీలక నేతలను తమ తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తూ తమ బలం పెంచుకుంటూ..ప్రత్యర్థి బలం తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో కూటమి సక్సెస్ అవుతూ వస్తుంది. ఇప్పటికే వైసీపీ కి చెందిన కీలక నేతలను తమ పార్టీలోకి చేర్చుకొని జగన్ కు షాక్ ఇవ్వగా..ఇప్పుడు చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ కి షాక్ ఇచ్చేందుకు వైసీపీ సిద్ధం అయినట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. శ్రీనాథ్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ నెల 25న సీఎం జగన్ సమక్షంలో శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ నుంచి శ్రీనాథ్ రెడ్డి భార్య అనిషారెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం ఆమెను టీడీపీ పుంగనూరు ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలకు శ్రీనాథ్ రెడ్డి, అనిషారెడ్డి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు వారిని వైసీపీ లోకి చేరుకొని తమ బలం పెంచుకోవాలని చూస్తుంది. ఒకవేళ వీరు వైసీపీ లో చేరితే చాల ఓట్లు వైసీపీ కి వెళ్లే ఛాన్స్ ఉందని అక్కడి రాజకీయ నేతలు అంటున్నారు.
Read Also : ASI Umadevi Suspended : బీజేపీ అభ్యర్థిని కౌగిలించుకున్నందుకు ఏఎస్ఐ సస్పెన్షన్..