Ambati: చంద్రబాబు పరిపాలనలో పవన్ ఎందుకు ప్రశ్నించలేదు : అంబటి
- By Balu J Published Date - 05:50 PM, Thu - 21 December 23

Ambati: టీడీపీ, జనసేనపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. లోకేష్ యువగళం సభ అట్టర్ ఫ్లాపైందని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ తన క్యాడర్‌ను మోసం చేస్తున్నారన్న అంబటి రాంబాబు..పవన్ ఎప్పుడూ చంద్రబాబుతో కలిసే ఉన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ఐదేళ్లు అడ్డగోలుగా పరిపాలన చేసినప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్‌లను పవన్ కల్యాణ్ ఎన్నోసార్లు తిట్టారని, అలాంటి పవన్ మళ్లీ చంద్రబాబుతో కలిశారని అంబటి రాంబాబు అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని వ్యాఖ్యనించడంపై స్పందించారు. ‘ జనసేన (Jana Sena) పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసే పనిచేశాయి కదా కొత్తగా కలిసి పోటీ చేస్తామని చెప్పడంలో వింత ఏముందని ’ ప్రశ్నించారు. 2014లో రెండు పార్టీలు కలిసి పనిచేశాయి. 2019లో వైసీపీని ఓడించడానికి విడివిడిగా పనిచేశాయని పేర్కొన్నారు. నారా లోకేశ్ ను బలోపేతం చేసేందుకే జనసేన పార్టీ పెట్టారా? అని మంత్రి అంబటి విమర్శించారు.
Also Read: Bigg Boss: బిగ్ బాస్ దాడి ఘటనలో 16 మంది అరెస్ట్