Whats Today : మేడిగడ్డకు మంత్రులు.. రూ.584 కోట్ల ‘విద్యాదీవెన’ నిధుల విడుదల
Whats Today : ఇవాళ తెలంగాణ మంత్రుల బృందం మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శించనుంది.
- By Pasha Published Date - 08:25 AM, Fri - 29 December 23

Whats Today : ఇవాళ తెలంగాణ మంత్రుల బృందం మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శించనుంది. ఆయా ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితులను మంత్రులు పరిశీలించనున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తొలుత కాళేశ్వరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే చేస్తారు. అనంతరం మేడిగడ్డ డ్యామ్ 19, 20, 21 పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో దగ్గరకు వెళ్లి చూస్తారు. ఈ పిల్లర్లు కుంగిపోవడంతో తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోవడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
- ఇవాళ వ్యూహం సినిమాపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ మూవీపై ఏపీ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసింది. సోనియా, కాంగ్రెస్ పరువుకు భంగం కలిగించేలా సినిమాను చిత్రీకరించాలని పిటిషనర్ పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను పునఃపరిశీలించాలని కోరారు.
- ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ భీమవరంలో పర్యటించనున్నారు. ‘విద్యా దీవెన’కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
- ఈరోజు జగనన్న విద్యాదీవెన పథకం కింద అర్హులైన 8,09,039 మంది విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో రూ.584 కోట్లు జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
- మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి ఇవాళ(Whats Today) సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ఖరారు ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. బాలినేనితో భేటీ అనంతరం సీఎం జగన్ అభ్యర్ధులను ప్రకటించే ఛాన్స్ ఉంది.
- ఇవాళ గుంటూరు జిల్లాలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పర్యటించనున్నారు. పొన్నూరు మండలం మామిళ్ళపల్లిలో ఆయుష్మాన్ ఆరోగ్య భవనంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ఆయన పరిశీలించనున్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో ప్రధానమంత్రి ఆరోగ్య సేవా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈసందర్భంగా ఎయిమ్స్ విద్యార్థులతోనూ ముఖాముఖిలో ఆయన పాల్గొంటారు.
Also Read: Trump Blocked : ట్రంప్‌పై ‘మెయిన్’ బ్యాన్.. అధ్యక్ష ఎన్నికల బాటలో రెడ్ సిగ్నల్
- సిరిసిల్ల పట్టణంలో ఇవాళ జరిగే పలు ప్రైవేట్ కార్యక్రమాలలో సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు.
- ఇవాళ సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.