Whats Today : రాజమండ్రి ఎయిర్‌పోర్టు పనులకు శ్రీకారం.. విజయవాడలో నిర్మలా సీతారామన్
Whats Today : ఇవాళ విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో నౌకాదళ దినోత్సవం (నేవీ డే) నిర్వహిస్తారు.
- By Pasha Published Date - 07:51 AM, Sun - 10 December 23

Whats Today : ఇవాళ విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో నౌకాదళ దినోత్సవం (నేవీ డే) నిర్వహిస్తారు. ఏటా డిసెంబర్ 4న నేవీ డే జరుపుకుంటాం. ఈసారి మిచాంగ్ తుపాను కారణంగా 4న జరగాల్సిన వేడుకలను 10కి వాయిదా వేశారు. ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎంతో పాటు ముగ్గురు మంత్రులు పర్యటిస్తారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి ఖమ్మం, కొత్తగూడెం భద్రాచలంలో పర్యటిస్తారు.
- ఇవాళ సంగారెడ్డి జిల్లాలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటిస్తారు. జోగిపేటలో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభిస్తారు.
- ఇవాళ సెక్రటేరియట్‌లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు.
- ఇవాళ విజయవాడ నగరంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే సంగీత నీరాజనంలో పాల్గొంటారు.
- ఇవాళ(Whats Today) రాజమండ్రి విమానాశ్రయ టెర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేస్తారు. రూ.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ తదితర అభివృద్ధి పనులు జరుగుతాయి.