YS Sharmila : షర్మిల ఫస్ట్ మీటింగ్ లో ఏం మాట్లాడతారో..?
- By Sudheer Published Date - 11:51 AM, Sat - 20 January 24

వైస్ షర్మిల (YS Sharmila) రేపు ఏపీ APCC అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏం మాట్లాడబోతారు..? అనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది. షర్మిల రీసెంట్ గా తన పార్టీ YSRTP ని కాంగ్రెస్ లో విలీనం చేసి..ఆమె కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించింది. ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమించింది. షర్మిల ఎంట్రీ తో ఇక ఏపీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపు ఆమె పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రీసెంట్ గా హైదరాబాద్ లో తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్ తో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ, సినీ ప్రముఖులు వేడుకలకు హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు హాజరైన అన్న జగన్ తో షర్మిల అంటిముట్టినట్లే ఉంది. ఎక్కడ కూడా జగన్ తో మాట్లాడినట్లు కనిపించలేదు. ఫోటో దిగేందుకు కూడా పెద్ద ఇంట్రస్ట్ చూపించలేదు. ఈ తరుణంలో రేపు ఆమె పిసిసి అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ ప్రభుత్వం ఫై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో అని అంత ఎదురుచూస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆమె హైదరాబాద్ నుంచి ఇడుపాలపాయకు బయలుదేరి వెళ్ళనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వైయస్సార్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించి.. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం కడప నుంచి విజయవాడ వెళ్ళనున్నారు. ఉదయం 11 గంటలకు విజయవాడలో పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో షర్మిల ఎంట్రీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆమె రాజకీయంగా ఏం మాట్లాడబోతున్నారు? జగన్ టార్గెట్ చేస్తారా? టిడిపి, జనసేన, బిజెపి విషయంలో ఆమె తీసుకునే స్టాండ్ అంటి అనేది తెలుసుకోవాలని అంత తహతహలాడుతున్నారు.
గతంలో తెలంగాణ లో పార్టీ ప్రకటించిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వం ఫై పెద్ద యుద్ధమే చేసింది. కేసీఆర్ ఫై నిప్పులు చెరుగుతూ..జైలుకు వెళ్లడం కూడా చేసింది. ఇక ఇప్పుడు గత కొంతకాలంగా అన్న ఫై కోపం తో ఉన్న షర్మిల..ఇంకా ఏ రేంజ్ లో ఫైర్ అవుతుందో అని అంత మాట్లాడుకుంటున్నారు. మరి షర్మిల ఏం మాట్లాడుతుందో..? ఏపీలో కాంగ్రెస్ కు ఎంతమేరకు పూర్వ వైభవం తెస్తుందో..? ఇంత మందిని కాంగ్రెస్ లోకి లాగుతుందో చూడాలి.
Read Also : Great : బియ్యపు గింజలతో అయోధ్య రామాలయ నమూనా..