AP : జగన్ రెడ్డి ఎంత పెద్ద కుట్రకు తెర లేపాడో ..!! – టీడీపీ బట్టబయలు
ఓడిపోతున్నా అని తెలిసి, కౌంటింగ్‌కి ఆటంకం కలిగించటానికి జగన్ రెడ్డి ఎంత కుట్రకు తెర లేపాడో చూడండి
- Author : Sudheer
Date : 16-05-2024 - 10:08 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో పోలింగ్ (AP Polling) జరిగిన రోజు దగ్గరి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పల్నాడు లో పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. టీడీపీ(TDP), వైసీపీ(YCP) శ్రేణులు రెండు గ్రూపులుగా విడిపోయి..బాంబులు, పెట్రోలు బాంబులతో దాడులు చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఈ ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొగా.. పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొద్ది సేపటికి పరిస్థితి సాధారణంగా మారినప్పటికీ.. మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఇలా రెండు రోజుల పాటు జిల్లాలో పలు ప్రాంతాలలో దాడులు జరిగాయి.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా పిన్నెల్లి గ్రామంలో గొడవల నేపథ్యంలో, పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టగా భారీగా పెట్రో బంబులు బయటపడ్డాయి. పెట్రోలు బాంబుల ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. బాంబులు ఎవరు తయారుచేస్తున్నారో విచారణ జరుపుతున్నాం అని .. జిల్లాలో మరింతగా తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదే విషయాన్నీ టిడిపి పార్టీ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
‘ఓడిపోతున్నా అని తెలిసి, కౌంటింగ్‌కి ఆటంకం కలిగించటానికి జగన్ రెడ్డి ఎంత కుట్రకు తెర లేపాడో చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు ప్లాన్ చేసిన జగన్ రెడ్డి కుట్ర, పల్నాడులో బయట పడింది. పల్నాడులో రెచ్చిపోతున్న వైసీపీ మూకలని కంట్రోల్ చేసే పనిలో భాగంగా, మాచవరం మండలం పిన్నెల్లిలో సోదాలు చేస్తున్న పోలీసులకు, వైసీపీ నేత సైదా ఇంట్లో రసాయనాలు కలిపిన నాటు బాంబులు, పగిలిన బీరు సీసాలు, పెట్రోల్ బాంబులు, కత్తులు, గొడ్డళ్ళు స్వాధీనం చేసుకున్నారు’ అని ట్వీట్ చేసింది.
ఓడిపోతున్నా అని తెలిసి, కౌంటింగ్‌కి ఆటంకం కలిగించటానికి జగన్ రెడ్డి ఎంత కుట్రకు తెర లేపాడో చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు ప్లాన్ చేసిన జగన్ రెడ్డి కుట్ర, పల్నాడులో బయట పడింది. పల్నాడులో రెచ్చిపోతున్న వైసీపీ మూకలని కంట్రోల్ చేసే పనిలో భాగంగా, మాచవరం మండలం పిన్నెల్లిలో సోదాలు… pic.twitter.com/w0YOiO21l2
— Telugu Desam Party (@JaiTDP) May 16, 2024
Read Also : Somireddy: అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికలు ఇవి: మాజీ మంత్రి సోమిరెడ్డి