Somireddy: అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికలు ఇవి: మాజీ మంత్రి సోమిరెడ్డి
- By Balu J Published Date - 09:57 PM, Thu - 16 May 24

Somireddy: దాడులకు పాల్పడుతూ.. అరాచకం సృష్టిస్తున్న వైసీపీ నేతలు ఇకనైనా తగ్గాలని లేదంటే జూన్ 4 తరువాత తగిన మూల్యం చెల్లించుకుంటారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్ల అరాచకాన్ని పారదోలేందుకు ప్రజలు కట్టలు తెంచుకును వచ్చి ఓట్లు వేశారు. దాన్ని తట్టుకోలేక వైసీపీ నేతలు ఫ్రస్టేషన్ లో దాడులకు తెగబడుతున్నారు. జగన్ రెడ్డి షాడో ఛానల్ తప్పుడు కథనాలను ప్రసారం చేస్తుంది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి వైసీపీ 100 సీట్లలో గెలుస్తుందని ఊకదంపుడు ప్రసారాలు చేసుకుటుంది. దుర్మార్గంగా దాడులు జరుగుతున్నా సాక్షి తప్పుడు కథనాలు ప్రసారం చేయడం సిగ్గుచేటు. ఎలక్షన్ కమిషన్ డీజీపీని చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించిన చరిత్ర ఏ రాష్ట్రంలో జరగలేదు.
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మే 13న జరిగిన ఎన్నికలు అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగినవి. అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ ను అరాచకాంధ్రప్రేదేశ్ గా మార్చాడు. చట్టాన్ని జగన్ కాళ్ల కింద నలిపేశాడు. ఐఏఎస్, ఐసీపీఎస్ లను కూలీల కింద మార్చాడు. శాసన సభలో తీసుకున్ననిర్ణయాలను చెత్తబుట్టలో పడేశాడు. చట్టసభ నిర్ణయాలకు విలువలేదు, వ్వవస్థలకు విలువలేదు. ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు జగన్ రెడ్డి పాలన. నాడు బీహార్ ఎలా ఉందో నేడు ఏపీని అలా తాయరు చేశాడు. బయటికి వెళితే ఏపీ అంటే తలదించుకునే పరిస్థితికి జగన్ దిగజార్చాడు.
రాష్ట్ర భవిష్యత్ ఎవరి చేతిలో ఉంటే బాగుంటుతో ఓటర్లకు తెలుసు అందుకే వ్యయాన్ని లెక్కచేయకుండా దూర ప్రాంతాల నుండి వచ్చి ఓట్లు వేశారు. దీన్ని జీర్ణించుకోలని వైసీపీ నేతలు దగ్గర ఉండి దాడులు చేయిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రావడం పక్కా.. 135 సీట్లతో టీడీపీ గెలవబోతుంది. కడపలో కూడా వైసీపీ ఓడిపోబోతుంది. కడప పార్లమెంట్ లో టీడీపీకి మెజార్టీ సీట్లు వస్తాయి. ఉమ్మడి నెల్లూరులో టీడీపీ 10 సీట్లలో గెలవబోతుంది. దుర్మార్గుల నుండి రాష్ట్రాన్ని కాపాడటానికి టీడీపీకి ప్రజలు అధికారం కట్టబెట్టేందుకు భారీగా ఓట్లు వేశారు అని అన్నారు.