Nara Lokesh : విశాఖ ఎయిర్ పోర్టులో నారా లోకేష్ కు ఘనస్వాగతం
- By Sudheer Published Date - 09:04 PM, Sat - 10 February 24

ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ (CM jagan)..సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించగా..ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఈనెల 11 నుంచి ‘‘శంఖారావం’’ పేరిట యువనేత ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) జరగని ప్రాంతాల్లో పర్యటించేలా లోకేష్ ప్రణాళికలు సిద్ధం చేసారు. ఉత్తరాంధ్ర నుంచి లోకేష్ శంఖారావం ప్రారంభంకానుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ తరుణంలో వైజాగ్ కు చేరుకున్న లోకేష్ కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇచ్చాపురంలో ఆదివారం (ఫిబ్రవరి 11) నుంచి ప్రారంభంకానున్న శంఖారావం కోసం లోకేష్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. పార్టీశ్రేణులకు అభివాదం చేసిన అనంతరం లోకేష్ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గాన ఇచ్చాపురం బయలుదేరారు. మొదటి విడతలో 11 రోజుల పాటు రోజుకు మూడు చొప్పున ఉత్తరాంధ్రలోని 31 నియోజకవర్గాల్లో లోకేశ్ సభలు, సమావేశాలు నిర్వహిస్తారు.
రేపు ఇచ్చాపురంలోఉదయం 10.30గంటలకు లోకేష్ చేతులమీదుగా శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో లోకేష్ కార్యక్రమాలకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేయడంతో పాటు వైసీపీ అక్రమాలను ఎదుర్కోవడంపై టీడీపీ క్లస్టర్, బూత్, యూనిట్ ఇన్‌ఛార్జులు, కుటుంబ సాధికార సారథులకు దిశానిర్దేశం చేస్తారు.
Read Also : Harish Rao : ‘CM పదవి కోసం హరీష్ రావు రూ.5 వేల కోట్లు సిద్ధం చేసుకున్నాడు’ – జగ్గారెడ్డి