Exit Poll 2024 : ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా…జూన్ 4న భారీ మెజార్టీతో గెలుస్తున్నాం – జగన్
ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా...జూన్ 4న భారీ మెజార్టీతో గెలుస్తున్నామని పార్టీ నేతలకు తెలిపినట్లు తెలుస్తుంది
- By Sudheer Published Date - 06:39 PM, Sat - 1 June 24

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో జరిగిన పోలింగ్ కు సంబదించిన ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ మరికాసేపట్లో వెల్లకాబోతున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఏంచెపుతాయో..? ఎవరు గెలుస్తారని చెపుతాయో..? తెలుసుకోవాలని అంత ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ ఫలితాల కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు దేశ వ్యాప్తంగా ప్రజలు సైతం ఆసక్తి కనపరుస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ సీఎం , వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా…జూన్ 4న భారీ మెజార్టీతో గెలుస్తున్నామని పార్టీ నేతలకు తెలిపినట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఏపీలో గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరగడంతో కూటమి నేతల్లో గెలుపు ఫై ధీమా పెరుగుతూ వచ్చింది. ఇదే సందర్భంలో సోషల్ మీడియా లో వైసీపీ ఓటమి చెందుతుందని , కూటమి భారీ సీట్లు సాదించబోతుందని మౌత్ టాక్ విపరీతంగా పెరిగింది. ఎవర్ని పలకరించిన కూటమే విజయం అంటూ చెపుతూ వచ్చారు. దీంతో వైసీపీ నేతలు , పార్టీ శ్రేణులు కాస్త నిరాశకు లోనవుతూ వచ్చారు. ఈ క్రమంలో జగన్ ఎగ్జిట్ పోల్స్ ఫై స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా…జూన్ 4న భారీ మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పుకొచ్చారు. పోలింగ్ శాతం నమోదు..మహిళల మద్దతు…సామాజిక వర్గాల తీర్పు గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తొలి నుంచి నమ్ముకున్న వారంతా పార్టీకి అండగా నిలిచారని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. జూన్ 4న వెల్లడి కానున్న ఫలితాలతో దేశం మొత్తంఏపీ వైపు చూస్తుందని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రతిపక్షం గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తన్న అంశం పైన జగన్ ఎలాంటి కామెంట్ చేయలేదని సమాచారం.
Read Also : Exit Poll 2024 : ఏపీలో గెలుపు ఎవరిదీ..? ఎగ్జిట్ పోల్స్ ఏంచెప్పబోతున్నాయి..?