Viveka Murder : జగన్ ఢిల్లీ వెళ్లిన వేళ..అవినాష్ రెడ్డికి ఊరట
ఏపీ సీఎం ఢిల్లీ వెళ్లిన వేళ..సేఫ్ గా అవినాష్ (Viveka Murder ) బయటపడ్డారు. 31వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు చెప్పింది.
- Author : CS Rao
Date : 27-05-2023 - 3:16 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం ఢిల్లీ వెళ్లిన వేళ..ప్రస్తుతానికి సేఫ్ గా అవినాష్ (Viveka Murder ) బయటపడ్డారు. ఈనెల 31వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు చెప్పింది. ఏ ఆధారాలతో అవినాష్ రెడ్డి మీద అభియోగాలు మోపుతున్నారంటూ సీబీఐని(CBI) ప్రశ్నించింది. సాక్షుల వాగ్మూలం మేరకు అభియోగాలు ఉన్నాయని చెబుతూ, సీల్డ్ కవర్ లో వాటిని అందిస్తామని సీబీఐ కోర్టుకు విన్నవించింది. అందుకు సమ్మతించిన కోర్టు అవినాష్ రెడ్డికి ఊరటను ఇస్తూ బుధవారం వరకు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది.
ఏపీ సీఎం ఢిల్లీ వెళ్లిన వేళ..ప్రస్తుతానికి సేఫ్ గా అవినాష్ (Viveka Murder )
ప్రస్తుతం అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి జైలులో అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు నిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. అలాగే, తల్లి శ్రీలక్ష్మికి హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె అనారోగ్యం దృష్ట్యా ఈనెల 31వ తేదీ వరకు (Viveka Murder) ఎలాంటి అరెస్ట్ వద్దంటూ సీబీఐకి కోర్టు తెలిపింది. ముందస్తు బెయిల్ మీద సుదీర్ఘ వాదనలు తెలంగాణ హైకోర్టు ఆలకించింది. గత కొన్ని రోజులుగా వాయిదా వేస్తూ వచ్చిన ఈ పిటిషన్ మీద విచారణ ఈనెల 25న చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ మేరకు విచారణకు స్వీకరించినప్పటికీ ఆ రోజు నుంచి వాయిదా వేస్తూ శనివారం అవినాష్ రెడ్డి ఉపశమనం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ మీద ఈనెల 31న తుది తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు జడ్జి చెప్పడం తాత్కాలికంగా అవినాష్ రెడ్డి ఊపిరి పీల్చుకున్నట్టు అయింది.
Also Read : YS Viveka Murder Case: వైస్ సునీతపై అనుమానం వ్యక్తం చేసిన వైస్ఆర్ సోదరి
గత రెండు రోజులుగా సుదీర్ఘ వాదనలను తెలంగాణ హైకోర్టు ఆలకించింది. సీబీఐ, సునీతారెడ్డి తరపున న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ఆ సందర్భందా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును కూడా సీబీఐ అధికారులు ప్రస్తావించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగిన ముందు ఆ తరువాత వాట్సప్ కాల్స్ ను జగన్మోమోహన్ రెడ్డికి వెళ్లాయని సీబీఐ కోర్టుకు చెప్పింది. అందుకు సంబంధించిన ఆధారాలను శనివారం కోర్టు అడిగింది. ఫోన్ కాల్స్ బ్యాకప్ తీయడానికి అవకాశం ఉంటుంది. కానీ, వాట్సప్ కాల్స్ బ్యాకప్ తీయడానికి అవకాశం ఉందా? అంటూ సీబీఐని ప్రశ్నించింది. అలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేదని సమాధానం ఇచ్చింది. దీంతో వాట్సప్ కాల్ జగన్మోహన్ రెడ్డికి వెళ్లిందని ఎలా చెప్పగలరని సీబీఐ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది.
వాట్సప్ కాల్ జగన్మోహన్ రెడ్డికి వెళ్లిందని ఎలా
మొత్తం మీద మూడు రోజుల జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన తరువాత అవినాష్ రెడ్డికి పూర్తి స్థాయి(Viveka Murder) ఊపశమనం ఉంటుందని టీడీపీ చెబుతోంది. ఢిల్లీ పెద్దల జోక్యం ఈ కేసులో ఉందని అనుమానిస్తోంది. వాళ్లు కాపాడుతున్నందున ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాలేదని చెబుతోంది. తాడేపల్లి కోట లో జరిగిన మీటింగ్ బయటకు రావాలంటే అవినాష్ రెడ్డి కస్టోడియల్ విచారణకు తీసుకోవాలని సీబీఐ భావిస్తోంది. కానీ, న్యాయస్థానం నుంచి వచ్చిన సూచన మేరకు సీబీఐ మరో నాలుగు రోజులు టెన్షన్ లేకుండా ఉండొచ్చు. ఆ తరువాత కథ ఎటు మలుపు తిరుగుతుంది? అనేది పెద్ద ట్విస్ట్. ఢిల్లీ మూడు రోజుల జగన్మోహన్ రెడ్డి పర్యటన హిట్టా? ఫట్టా? అనేది ఈనెల 31వ తేదీన తెలుస్తుందని టీడీపీ వ్యంగ్యాస్త్రాలను విసురుతోంది.
Also read : Viveka murder case: సీబీఐ విచారణ వేళ అవినాశ్ రెడ్డి బిగ్ ట్విస్ట్.. ఏం జరిగిందంటే!