Viveka Murder : హత్య కుట్రదారుడు జగన్ బద్రర్ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ ?
కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కు (Viveka Murder) రంగం సిద్ధమైయింది.
- By CS Rao Published Date - 03:17 PM, Fri - 24 February 23

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బ్రదర్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కు (Viveka Murder) రంగం సిద్ధమైయింది. బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో సూత్రధారిగా అవినాష్ రెడ్డిని `గుగూల్ టేక్ ఔట్`(Google takout) తేల్చేసింది. మర్డర్ జరిగిన రోజు ఆయన కదలికలను సాంకేతికత పట్టేసింది. అంతేకాదు, అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి తో పాటు ఇతరుల ప్రమేయాన్ని కూడా గుగూల్ టేక్ ఔట్ బయటపెట్టేసింది. ఇప్పటికే గత నెల 28న ఒకసారి సీబీఐ విచారణ ఎదుర్కొన్న అవినాష్ రెడ్డి శుక్రవారం మరోసారి హాజరయ్యారు. తొలిసారి ఆయన మొబైల్ డేటాను విశ్లేషించిన సీబీఐ ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్, భారతి పీఏగా ఉన్న నవీన్ ను కడపలో విచారించింది. దీంతో శుక్రవారం అవినాష్ రెడ్డి ని సీబీఐ అరెస్ట్ చేస్తుందని విశ్వసనీయంగా తెలుస్తోంది.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కు రంగం(Viveka Murder)
శుక్రవారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(Viveka Murder) చేరుకున్నారు. ఆయనతో పాటు సీబీఐ కార్యాలయానికి వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు, వైసీపీ క్యాడర్ పెద్దఎత్తున చేరుకుంది. సీబీఐ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అవినాష్ అనుచరులను సీబీఐ కార్యాలయ పరిసరాల నుంచి పోలీసులు పంపించారు. సీబీఐ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు ఉంది. ఆ వాతావరణాన్ని చూస్తుంటే, అవినాష్ రెడ్డి అరెస్ట్ (Google takout)తథ్యమనిస్తోంది.
Also Read : Viveka murder : ఏపీ రాజకీయాల్లో `రక్త `సిత్రాలు! `జగనాసుర రక్తచరిత్ర`విడుదల!
వివేకానంద రెడ్డి హత్య కేసులో A2 గా ఉన్న సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో సీబీఐ వేసిన కౌంటర్ పిటిషన్‌లో హత్య జరిగిన రోజు నిందితులంతా భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు పేర్కొన్నారు. హత్య కుట్ర మొత్తం అవినాష్ కి ముందే తెలుసని తేల్చింది. ఘటనా స్థలంలో సాక్షాలను, ఆధారాలను అవినాష్ (Viveka Murder) ద్వారా చెరిపేశారని నిర్థారణకు వచ్చింది. అవినాష్ రెడ్డి తో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయానికి సంబంధించి సీబీఐ ఓ అంచనాకు వచ్చింది. హత్య కోసం 40 కోట్ల డీల్ వ్యవహారంపై అవినాష్ ను సీబీఐ శుక్రవారం ప్రశ్నించనుందని తెలుస్తోంది.
ఎంపీ సీటుకు అడ్డు వస్తాడనే వివేకా హత్యకు అవినాష్ కుట్ర(Viveka Murder)
సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఎంపీ సీటుకు అడ్డు వస్తాడనే కారణంతో వివేకా హత్యకు అవినాష్ కుట్ర(Viveka Murder) చేశారని సీబీఐ భావిస్తోంది. వైఎస్ వివేకాను చంపేందుకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి (A5)తో కలిసి అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కుట్ర పన్నారని నిర్థారణకు వచ్చింది. ప్లానును దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అమలు చేశారని తేలింది. వైఎస్ వివేకా పట్ట వ్యతిరేకంగా ఉన్న వాళ్లందరూ ఏకతాటిపైకి వచ్చారు. ఆయనపై కోపం ఉన్న ఎర్ర గంగిరెడ్డి (A1), యాదాటి సునీల్ యాదవ్ (A2), డ్రైవర్ షేక్ దస్తగిరి (A4 – అప్రూవర్), ఉమా శంకర్ రెడ్డిలను కూడగట్టారు. వాళ్లను ప్రత్యక్షంగా హత్యలో పాల్గొనేలా అవినాష్ రెడ్డి చేశారని సీబీఐ భావిస్తోంది. వజ్రాల పేరుతో సునీల్ యాదవ్ విలువైన రాళ్ల వ్యాపారం చేసేవాడని, వద్దని వివేకానంద రెడ్డి హెచ్చరించడంతో ఆయనపై సునీల్ కోపం పెంచుకున్నాడని పేర్కొంది. గంగిరెడ్డితో కలిసి వివేకా హత్యకు ప్లాన్ చేశారని కౌంటర్ పిటిషన్ లో తెలిపింది. హత్యకు సంబంధించి రూ.40 కోట్లతో ఒప్పందం కుదరడంలో సునీల్ యాదవ్ కీలకంగా వ్యవహరించాడని సీబీఐ ప్రాథమికంగా నిర్థారణకు వచ్చింది.
మొత్తం వివరాలను గుగూల్ టేక్ ఔట్
వివేకానంద రెడ్డిని హత్య(Viveka Murder) చేసిన రోజు నిందితులందరూ వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లుగా సీబీఐ తన కౌంటర్‌లో తెలిపింది. వివేకా హత్యకు కదిరి నుంచి గొడ్డలి తీసుకురావడానికి వెళ్లిన దస్తగిరి రాక కోసమే సునీల్‌యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. వివేకా హత్య ఘటన వెలుగులోకి రావడానికి కొంత సమయం ముందు (2019 మార్చి 15 తెల్లవారుజామున) నిందితులు శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి తదితరులు అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారని పేర్కొంది. ఇలా సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ సందర్భంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇక ఇప్పుడు అవినాష్ రెడ్డి ద్వారా నిజాలను చెప్పించడమే మిగిలి ఉంది. అందుకే, శుక్రవారం రెండోసారి అవినాష్ రెడ్డి ని సీబీఐ విచారణకు పలిచింది. ఆ సందర్భంగా ఆక్కడ వైసీపీ హడావుడి గమనిస్తే అరెస్ట్ అనివార్యంగా కనిపిస్తోంది. మొత్తం వివరాలను గుగూల్ టేక్ ఔట్ (Google takout)సీబీఐకి ఇచ్చేసింది. దాని ఆధారంగా వివేకా మర్డర్ కేసు మిస్టరీని ఛేధించారు.
Also Read : Viveka : జగన్ కోట రహస్యంలో వాళ్లిద్దరూ! క్లైమాక్స్ కు వివేకా హత్య కేసు విచారణ!