Viveka Case : CBIకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్, అవినాష్ అరెస్ట్ ?
వివేకానందరెడ్డి హత్య(Viveka Case) కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిముందుస్తు బెయిల్ మీద ఇప్పటికిప్పుడు తీర్పు చెప్పలేమని హైకోర్టు తేల్చేసింది.
- Author : CS Rao
Date : 28-04-2023 - 4:51 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య(Viveka Case) కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy)ముందుస్తు బెయిల్ మీద ఇప్పటికిప్పుడు తీర్పు చెప్పలేమని హైకోర్టు తేల్చేసింది. అయితే, సీబీఐ తనపని తాను చేసుకుని వెళ్లొచ్చని చెప్పింది. అంటే, అరెస్ట్ చేసుకోవడానికి పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. ముందస్తు బెయిల్ మీద తుది తీర్పును జూన్ 5వ తేదీకి రిజర్వ్ చేసింది. ఆ లోపుగా అర్జెంట్ అయితే చీఫ్ జస్టిస్ వద్దకు వెళ్లాలని సూచించింది. వెకేషన్ బెంచ్ కు మార్చుకోవచ్చని తెలిపింది.
ముందుస్తు బెయిల్ మీద ఇప్పటికిప్పుడు తీర్పు చెప్పలేమని హైకోర్టు(Viveka Case)
ముందస్తు బెయిల్ పిటిషన్ (Viveka Case) మీద సుదీర్ఘ వాదనలను తెలంగాణ హైకోర్టులోని డివిజన్ బెంచ్ ఆలకించింది. ఆ పిటిషన్ మీద ఇప్పటికే పలుమార్లు విచారణను వాయిదా వేసిన విషయం విదితమే. ఇరు పక్షాల సుదీర్ఘ వాదనలు ముగిసిన తరువాత శుక్రవారం తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టుకు సెలవులు కావున, జూన్ 5వ తేదీ వరకు తీర్పు కోసం ఉండాలని బెంచ్ చెప్పింది. అత్యవసరమైతే, చీఫ్ దగ్గరకు వెళ్లాలని బెంచ్ సూచించడం అవినాష్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్దమైనట్టుగా ఉంది.
జూన్ 5వ తేదీ వరకు తీర్పు కోసం ఉండాలని బెంచ్
హత్య కేసులో(Viveka Case) మొదటి నిందితుడు ఎర్రగంగిరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయన వచ్చే నెల వరకు జ్యూడిషయల్ రిమాండ్ కు కోర్టు పంపింది. ఇంకో వైపు ఇప్పటికే ఉదయకుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను సీబీఐ పలుమార్లు విచారించింది. సీబీఐలోని ఒక టీమ్ పులివెందుల, కడప ఏరియాల్లోనే పాగా వేసింది. ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ కృష్ణా రెడ్డిని విచారించడానికి గురువారం సీబీఐ వెళ్లింది. కానీ, ఆయన అందుబాటులో లేకపోవడంతో కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను విచారణ చేసింది. అంతేకాదు, కంప్యూటర్ ఆపరేటర్ ను రెండో రోజుల క్రితం విచారణ చేసింది.
Also Read : Viveka Murder :నో బెయిల్ ఓన్లీ అరెస్ట్,తాడేపల్లికిCBI?
గుగూల్ టేకౌట్ ద్వారా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి (Avinash Reddy)ఎక్కడ ఉన్నారు? అనేదానిపై సీబీఐ ఒక నిర్థారణకు వచ్చింది. జమ్మలమడుగు వెళుతోన్న సందర్భంగా ఆరోజు శివప్రకాష్ రెడ్డి తొలిసారిగా ఫోన్ చేసి వివేకా హత్య గురించి చెప్పాడని సీబీఐకి అవినాష్ రెడ్డి చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని సీన్ రీకనస్ట్రక్షన్ చేసి దర్యాప్తు చేశారు. అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేసిన తరువాత అవినాష్ రెడ్డి చెప్పిన మాటలు తప్పదని సీబీఐ భావిస్తోంది. అందుకే, ఆయన్ను అరెస్ట్ చేయాలని సీబీఐ భావిస్తోంది. ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కోర్టు కూడా సీబీఐ తనపని తాను చేసుకుని వెళ్లొచ్చని తెలియచేడంతో అరెస్ట్ అనివార్యంగా కనిపిస్తోంది.
Also Read : Viveka Murder Case: వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డిని విచారించిన సీబీఐ
సీబీఐ తన పని తాను చేసుకు పోవచ్చునని, ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకునేది ఉండదన్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయని తెలిపారు. సీబీఐ విచారణ చేసుకోవచ్చునని చెప్పారు. అనంతరం ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.