HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >What Should We Learn From The Vizianagaram Car Door Lock Incident

Car Door Lock: విజయనగరం కారు డోర్‌లాక్ ఘటన.. మనం ఏం నేర్చుకోవాలి ?

కారు డోర్లు, కిటికీలను క్లోజ్ చేసి లాక్ చేస్తే.. బయటి గాలి కారు(Car Door Lock) లోపలికి రాదు.

  • By Pasha Published Date - 08:42 PM, Mon - 19 May 25
  • daily-hunt
Vizianagaram Car Door Lock Incident Children Locked In Car Children Trapped In Car  

Car Door Lock: కారులో ఇరుక్కుపోయి ఊపిరాడక నలుగురు చిన్నారులు చనిపోయిన ఘటన విజయనగరం జిల్లాలో విషాదాన్ని మిగిల్చింది. విజయనగరం రూరల్ మండలం ద్వారపూడిలోని మహిళా మండలి కార్యాలయం వద్ద పార్క్ చేసి ఉన్న కారులో ఈ ఘోరం జరిగింది. దీంతో చిన్నారులు కంది మనేశ్వరి (6), బూర్ల చారులత (7), బూర్ల జాస్రిత (8), పంగి ఉదయ్ (7) ప్రాణాలు విడిచారు. ఈ పిల్లలు ఆడుకుంటూ.. పార్క్ చేసి ఉన్న కారును చూశారు. దానికి డోర్ లాక్ చేసి లేదు. దీంతో పిల్లలు అందులోకి ఎక్కారు. ఆ తర్వాత ఆటోమేటిక్‌ డోర్‌లాక్ పడిపోయింది. ఆ తర్వాత పిల్లలు కారు డోర్ తీసేందుకు యత్నించినా అది ఓపెన్ కాలేదు. దీంతో అందులోనే చిక్కుకుపోయి ఊపిరాడక చనిపోయారు. ఈవిధమైన ఘటనలు ఇటీవల కాలంలో మనదేశంలో చాలానే చోటుచేసుకున్నాయి.

Also Read :Snoring Husbands: గురక పెట్టే భర్తలపై ‘పూరి మ్యూజింగ్స్‌’.. స్లీప్‌ డివోర్స్‌‌ సీక్రెట్స్ ఇవిగో

లాక్ చేసిన కారులో.. ఏమవుతుంది ?

  • కారు డోర్లు, కిటికీలను క్లోజ్ చేసి లాక్ చేస్తే.. బయటి గాలి కారు(Car Door Lock) లోపలికి రాదు.
  • ఇలాంటప్పుడు కారులో ఎవరైనా ఉంటే.. క్రమంగా  కారులో కార్బన్ డయాక్సైడ్ మోతాదు పెరిగిపోతుంది. ఆక్సిజన్ తగ్గిపోతుంది. దీనివల్ల ఊపిరాడదు.
  • కారు లోపల ఉన్నవారికి తల తిరుగుతుంది.
  • తల తిరగడం పెరిగి ఊపిరాడక..  కారులో ఉన్నవారు చనిపోతారు.
  • అందుకే కార్లలో, ఇతర వాహనాల్లో పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లకూడదు.
  • కార్లను లాక్ చేసే ముందు..ఆ వాహనంలో ఎవరైనా ఉన్నారా అనేది చెక్ చేయాలి.

Also Read :All Party Delegations: అఖిలపక్ష బృందాలకు రాజకీయ సెగ.. తెరపైకి థరూర్, మనీశ్, సల్మాన్, పఠాన్‌

కారు పార్కింగ్‌.. ఇవి గుర్తుంచుకోండి

  • మనం కారును పార్క్ చేస్తే, తప్పకుండా లాక్ చేయాలి.  కారులో పిల్లలు, ఇతర విలువైన వస్తువులు లేవని కన్ఫర్మ్ చేసుకోవాలి.
  • పల్లపు ప్రాంతాల్లో పార్క్ చేసిన వాహనాలు అకస్మాత్తుగా కదిలే అవకాశం ఉంటుంది.
  • సందుల్లో,చిన్న చిన్న రోడ్లపై అడ్డదిడ్డంగా కార్లను పార్క్ చేసినా ప్రమాదాలు జరుగుతాయి.
  • కారు లాకింగ్, అన్ లాకింగ్, హారన్ ప్రెస్సింగ్ వంటి విషయాలపై పిల్లలకు ప్రాథమిక విషయాలను నేర్పించాలి.
  • కొత్తగా వస్తున్న కార్లను ఫోన్‌లోని యాప్ ద్వారా అన్ లాక్ చేయొచ్చు. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసి ఉంచుకోవాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Car Door Lock
  • Car Door Lock Incident
  • Children Trapped In Car
  • Locked In Car
  • vijayanagaram
  • Vizianagaram

Related News

    Latest News

    • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

    • Hyundai Venue : మార్కెట్లోకి హ్యుందాయ్ వెన్యూకి పోటీగా 5 కొత్త SUVలు

    • Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

    • Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

    • Drinking Water: ‎నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

    Trending News

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd