Vijayawada : బెజవాడ నగర వాసులకు అందుబాటులోకి వచ్చిన రాజీవ్ గాంధీ పార్క్
విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న రాజీవ్ గాంధీ పార్క్‌ని వీఎంసీ సుందరీకణ సనులు చేపట్టింది. గతంలో పాడుబడినట్లు
- By Prasad Published Date - 08:35 AM, Fri - 6 January 23

విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న రాజీవ్ గాంధీ పార్క్‌ని వీఎంసీ సుందరీకణ సనులు చేపట్టింది. గతంలో పాడుబడినట్లు ఉన్న పార్క్‌ని సుందరీకరణ పేరుతో సరికొత్త హంగులతో తీర్చిదిద్దింది. అభివృద్ధి పనులు పూర్తయిన రాజీవ్ గాంధీ పార్క్ పనితీరును విజయవాడ నగర కార్పొరేషన్ కమీషనర్ స్వప్నిల్ పుండ్కర్ పరిశీలించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్ధిక,రాజకీయ, రవాణా,సాంస్కృతిక కేంద్రంగా ఉన్న విజయవాడ నగర సుందరీకరణ జరిగిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర మున్సిపల్ అధారిటీ మరియు పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో పర్యాటకం- వినోదం కి ప్రాముఖ్యత కల్పించామని తెలిపారు. విజయవాడ నగరంలో పర్యాటకం, వినోదం, మౌళిక సదుపాయాల కోసం జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసామని.. రాజీవ్ గాంధీ పార్కులో ప్రత్యేకంగా 6.56 కోట్లతో అమ్యూజ్ మెంట్ పార్క్ ఏర్పాటు చేసి ప్రారంభం చేయడం జరిగిందన్నారు.
నగరంలో మెండుగా E3 సౌకర్యాలకు సీఎం జగన్ మున్సిపల్ శాఖకు ఆదేశాలు జారీ చేశారని.. E3 అంటే ఈట్, ఎంజాయ్, ఎంటర్టైన్ కోసం ప్రత్యేక జోన్స్ మున్సిపల్ శాఖ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విజయవాడలో సీఎం జగన్ సూచనల మేరకు బయోడైవర్సిటీ మ్యూజియం ఇప్పటికే మున్సిపల్ శాఖ ద్వారా ప్రారంభం చేసామని.. విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ అభివృద్ధి కోసం మౌళిక సదుపాయాలు ఏర్పాటు పర్యావరణాన్ని అందంగా తీర్చిదిద్దే భాద్యత ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ప్రస్తుతం రాజీవ్ గాందీ పార్క్ కి సందర్శకుల తాకిడి గతంతో పోలిస్తే బాగా పెరిగిందని.. సెలవు దినాలు, శని-ఆది వారాల్లో రాజీవ్ గాంధీ పార్కు లో సందర్శకుల తాకిడి 10% పెరిగిందని కమిషనర్ స్వప్నిల్ పుండ్కర్ తెలిపారు.