డ్రంక్ అండ్ డ్రైవ్ డెత్ కేసుల్లో బెజవాడ నెంబర్ 2
దేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు.
- By Hashtag U Published Date - 11:03 AM, Mon - 1 November 21

దేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మరణాల్లో ఏపీలోని విజయవాడ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.ఏపీలో మద్య నిషేధమంటూ ప్రభుత్వం వైన్ షాపుల సంఖ్య తగ్గించినప్పటికి ఎక్కడా కూడా ఆ ప్రభావం కనిపించడంలేదు. గతంలో హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగా ఉండేవి అయితే ఇప్పుడు ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన నివేదికలో దేశంలోనే రెండవస్థానం విజయవాడ ఉండటం ఆందోళన కలిగించే విషయమని చెప్పాలి.
ఏపీలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా పెద్దగా జరగడం లేదు.పక్క రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా మద్యం అక్రమ రవాణా జరుగుతున్న పోలీసులు చూసిచూడనట్లు వదిలేస్తున్నారు.దీంతో చాలా మంది యువకులు మద్యం సేవించి పట్టణాల్లో అర్థరాత్రి బైక్ రైడింగ్‌లు చేస్తున్నారు.మద్యం మత్తులో బైక్ రైడింగ్స్ చేసి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
2020లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 17,924 రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 7,039 మంది మరణించగా…19,675 మంది గాయపడినట్లు ఎన్‌సిఆర్‌బి విడుదల చేసిన తాజా నివేది.కలో పేర్కొంది. 2020లో మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ఏపీలో 94 మంది మరణించగా, అందులో విజయవాడలో 67 మంది ఉన్నారు.2020వ సంవత్సరంలో 53 నగరాల్లో చెన్నైతరువాత విజయవాడ నగరంలో మరణాలు ఎక్కువ సంభవించినట్లు ఎన్సీఆర్‌బీ తెలిపింది. కోల్‌కతాలో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ 345 మందిపై కేసులు నమోదైయ్యాయి. అయితే ఇక్కడ రెండు మరణాలు మాత్రమే సంభవించగా..338 కేసుల్లో గాయాలైనట్లు నివేదిక పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో 2020లో మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన 154 కేసులు నమోదయ్యాయి. వీటిలో 94 మంది మరణించాగా..168 కేసులు గాయాలైనట్లు వెల్లడించింది.విజయవాడలో 96 కేసుల్లో 67 మరణాలు, 102 కేసులు గాయాలు నమోదయ్యాయి.విశాఖపట్నంలో నాలుగు కేసుల్లో కేవలం ఒకరు మాత్రమే మరణించగా…రెండు కేసులు గాయాలైనట్లు నివేదికలో తెలిపింది.కోవిడ్-19 లాక్‌డౌన్, ఆంక్షలు కారణంగా 2019తో పోలిస్తే 2020లో రోడ్డు ప్రమాదాలు కనీసం 13 శాతం తగ్గాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మహమ్మారి కారణంగా 2020లో తాగి డ్రైవింగ్ చేసే వారి సంఖ్య తగ్గినట్లు వారు తెలిపారు.వైజాగ్ నగరంలో రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయాలు పాలైనట్లు ఎన్సీఆర్‌బీ వెల్లడించింది. విశాఖలో రోడ్డు ప్రమాదాల బారిన పడి 255 మంది ప్రాణాలు కోల్పోగా, 1,182 మందికి గాయాలయ్యాయి. విజయవాడలో 2020లో1,144 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీరిలో 274 మంది ప్రాణాలు కోల్పోగా, 977 మంది గాయపడ్డారు.
Related News

Vijayawada Railway Restaurant : విజయవాడలో తొలి రైల్వే రెస్టారెంట్.. ‘హల్దీరామ్స్ ఆన్ వీల్స్’
Vijayawada Railway Restaurant : విజయవాడలో ఫుడ్ లవర్స్ చాలా ఎక్కువ.