HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vijayasai Reddy Satires On Tdp

AP : టీడీపీ పార్టీకి నాలుగే గతి – విజయసాయి రెడ్డి

2019 నాటి ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టి చంద్రబాబుపై జాలి చూపారు. 2014-2019 మధ్యకాలంలో చంద్రబాబు.. తమ పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడని గుర్తు చేశారు.

  • Author : Sudheer Date : 24-05-2024 - 11:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YCP MP Vijayasai Reddy
YCP MP Vijayasai Reddy

ఏపీ ఫలితాలపై ఎలాంటి ఉత్కంఠ నెలకొందో తెలియంది కాదు..ఏపీలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది..? ఎవరు ఎంత మెజార్టీ తో గెలుస్తారు…? ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు..? ఇలా ఎవరికీ వారు మాట్లాడుకుంటూ ఆసక్తి కనపరుస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల పోలింగ్ శాతం పెరగడంతో గెలుపు మాదంటే..మాదే అంటూ అధికార పార్టీ తో పాటు కూటమి పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఎవరెవరు ఎంత మెజార్టీ తో విజయం సాదించబోతున్నారో కూడా లెక్కలు వేసుకుంటూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నెల్లూరు లోక్‌సభ సభ్యుడు విజయసాయి రెడ్డి..టీడీపీ అధినేత చంద్రబాబు పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. 2019 నాటి ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టి చంద్రబాబుపై జాలి చూపారు. 2014-2019 మధ్యకాలంలో చంద్రబాబు.. తమ పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు 23 స్థానాలే దక్కాయని చెప్పారు. అప్పట్లో మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగిందనీ పేర్కొన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని కొనుగోలు చేశాడని, జూన్‌ 4వ తేదీ నాడే కౌంటింగ్ జరగబోతోందని .. ఈ సారి ఎన్ని సీట్లకు చంద్రబాబు పరిమితం కాబోతున్నాడో ఈ పాటికి అర్థమై ఉంటుందని అన్నారు. ఈ లెక్కన టీడీపీ నాలుగు స్థానాలే దక్కబోతోన్నాయని, అందుకే చంద్రబాబు మీద జాలి వేస్తోందని చెప్పుకొచ్చారు. విజయసాయి కామెంట్స్ ఫై టీడీపీ శ్రేణులు తమదైన శైలిలో విమర్శలు కురిపిస్తున్నారు.

Read Also : AP : గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • tdp
  • Vijayasai reddy

Related News

GODAVARI PUSHKARALU REVIEW

AP : గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష ..త్వరలో పుష్కర లోగో విడుదల

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక వైభవం ఉట్టిపడేలా… మరింత ఆకర్షణీయంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి సమీప ప్రాంతాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నందున పుష్కరాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో ఆర్ధిక కార్యకలాపాలు ప

    Latest News

    • Blender’s Pride : కోల్‌కతాలో బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ సాంస్కృతిక ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

    • AI CRM : భవిష్యత్ శ్రామిక శక్తి వైపు భారత్.. 10 లక్షల మంది యువతకు సేల్స్‌ఫోర్స్ ఏఐ శిక్షణా సంకల్పం

    • Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!

    • Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ

    • Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd