HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vijaya Sai Reddy Satires On Chandrababu About Pegasus Issue

Pegasus Spyware: అతి త్వ‌ర‌లో.. బాబు ఫైల్స్ ఓపెన్..?

  • Author : HashtagU Desk Date : 19-03-2022 - 3:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Pegasus Vijayasaireddy
Chandrababu Pegasus Vijayasaireddy

ఆంధ్రప్రదేశ్‌లో పెగాసస్ వివాదం ఓ రేంజ్‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల‌పై నిఘా ఉంచేందుకు అక్ర‌మంగా పెగాస‌స్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారంటూ, అధికార బీజేపీ పై ప్ర‌తిప‌క్షాలు ఆరోపించాయి. అయితే ఇప్పుడు ఈ పెగాసిస్ వివాదం ఏపీలో క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెగాసస్ పై చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఎవ‌రూ ఊహించని విధంగా మ‌మ‌తా బెన‌ర్జీ త‌న‌ పాత మిత్రుడు చంద్ర‌బాబును ఇరికించారు. అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే పెగాసస్‌ను కొనుగోలు చేయాల్సిందిగా త‌న ద‌గ్గ‌ర‌కు ఆఫర్ వచ్చిందని, అయితే అందుకు తాను నిరాక‌రించాన‌ని మ‌మ‌తా చెప్పారు. అంతేకాదు అప్పట్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగాఉన్న చంద్రబాబు పెగాస‌స్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారంటూ బాంబు పేల్చారు. దీంతో ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డిన చంద్ర‌బాబు అండ్ టీడీపీ త‌మ్ముళ్ళు వెంట‌నే మ‌మ‌తా బెన‌ర్జీ పై గుంపుగా అటాక్ మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ పెగాసస్ స్పైవేర్ వివాదంలో ఏపీలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీల మ‌ధ్య ఓ రేంజ్‌లో మాట‌ల యుద్ధం సాగుతోంది. చంద్ర‌బాబు పై పెగాస‌స్ బాంబు పేల్చింది మ‌మ‌తా అయితే టీడీపీ నేత‌ల మాత్రం జ‌గ‌న్ అండ్ వైసీపీ నేత‌ల పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై మొద‌ట సైలెంట్‌గానే ఉన్న వైసీపీ నేత‌లు, ఇప్పుడు చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. టెక్నాల‌జీ ఆద్యుడు 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబు విజ‌న‌రీ భాగంగా పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనే ఉండొచ్చ‌ని వైసీపీ నాయ‌కులు సెటైర్స్ వేస్తున్నారు.

ఈ విష‌యం స్వ‌యంగా ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మమతా బెన‌ర్జీ వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు ఆనుమానాల‌కు తావిస్తుంద‌ని, ఏదో జ‌రిగింద‌నేది మాత్రం స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబు పై సెటైర్స్ వేశారు. ది క‌శ్మీర్ ఫైల్స్ సినిమాను గుర్తు చేస్తూ త్వ‌ర‌లోనే బాబు ఫైల్స్ ఓపెన్ అవుతాయని వణికిపోతున్నారని, చేసిన పాపాలు కోడెనాగుల్లా వెంటపడుతున్నాయ‌ని చంద్ర‌బాబు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు విజ‌య‌సాయిరెడ్డి. అంతే కాకుండా పెగాసస్ స్పైవేర్ కొనుగోలు విషయంపై ప‌శ్చిమ బెంగాల్ సీఎం మమతా బెన‌ర్జీ బాంబు పేల్చిన క్ష‌ణం నుంచి తండ్రీకొడుకులకు ముచ్చెమటలు పడుతున్నాయని, అప్ప‌ట్లో పార్టీల‌కు ఫండింగ్ చేసిన బాబు ఫైల్స్ ఓపెన్ అవుతాయ‌ని చంద్ర‌బాబు భ‌యంతో వ‌ణికిపోతున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి కామెంట్స్ చేశారు. మ‌రి విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్య‌ల‌పై టీడీపీ త‌మ్ముళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • chandrababu
  • mamata benarjee
  • Pegasus Software
  • tdp
  • Vijayasai reddy
  • West Bengal
  • ysrcp

Related News

Chandrababu Pawan Kalyan

తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం

బుధువారం జరిగిన రెండు గంటల సుదీర్ఘ భేటీలో, రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) కుట్రలు చేస్తోందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అశాంతిని కలిగించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు

  • Pawan Kalyan Narrowly Escap

    పవన్ కళ్యాణ్ చెపితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా ? – TPCC చీఫ్ మహేష్

  • Ambati Rambabu Son in Law Upesh

    చంద్రబాబు మీద అనుచిత వాక్య పై మా మామ అంబటి రాంబాబు బాధపడుతున్నారు: అల్లుడు ఉపేష్

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు

  • Ambati Rambabu's Funeral

    పంజాగుట్ట శ్మశాన వాటికలో అంబటి రాంబాబు అంత్యక్రియలు.. అట్లుంటది బాబు జోలికి వస్తే !!

Latest News

  • అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారంటూ పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు!

  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

  • ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

  • సీఎం రేవంత్ బినామీ కంపెనీకి రూ.6వేల కోట్ల పనులు – కేటీఆర్ సంచలన ఆరోపణలు

  • ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ

Trending News

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd