BJP Leaders : ఏపీలో బయటపడుతున్న బిజెపి నేతల రాసలీలల వీడియోలు
BJP Leaders Hot Videos : వస్తావా... మందు తాగుదాం... పోయినసారి చేసినట్లు చేద్దాం అంటూ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
- By Sudheer Published Date - 11:45 AM, Thu - 10 October 24

గతంలో వైసీపీ నేతల తాలూకా రాసలీలల వీడియోలు (Rasalilala Videos) వైరల్ గా మారితే..ఇప్పుడు బిజెపి నేతలకు సంబదించిన వీడియోస్ కాల్స్ బయటకు వస్తూ హల్చల్ చేస్తున్నాయి. మొన్నటికి మొన్న బీజేపీ కార్యకర్త సుకన్యతో జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర (Vanama Narendra) మాట్లాడుతున్న వీడియో కాల్ (Video Calls) లీక్ కావడం చర్చనీయాంశమైంది. వస్తావా… మందు తాగుదాం… పోయినసారి చేసినట్లు చేద్దాం అంటూ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనికి గురించి ఇంకా మాట్లాడుకుంటుండగానే..తాజాగా గుంటూరు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ (Patibandla Ramakrishna) కు సంబదించిన అసభ్యకర వీడియో లీక్ అయింది. ప్రైవేట్ పార్టులు చూపిస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. మహిళ ఫేస్ కనిపించకుండా బ్లర్ చేస్తూ వీడియో ఉంది.
వరుసగా బీజేపీ నేతలు మహిళలతో మాట్లాడుతున్న వీడియోలు బయటకురావడంపై నేతల్లో ఆందోళన నెలకొంది. ఈ వీడియోల అంశం బీజేపీ నాయకత్వం దృష్టికి వెళ్లింది. బీజేపీ మీడియా వ్యవహారాలు పర్యవేక్షించే నేత ఒకరు దీనిపై విచారణ చేసి.. పార్టీ పెద్దలకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ జిల్లా ముఖ్యనేత వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో పార్టీ ఉలిక్కిపడింది. ఇప్పుడుమరో బీజేపీ నేత వీడియో బయటికి రావడం మరింత కలకలం రేపింది. ఆ ఇద్దరు నేతల వీడియోలు బయటకు రావడం వెనుక సొంత పార్టీ నేతల ప్రమేయమున్నట్లు ప్రచారం జరుగుతోంది.