Vellampalli Srinivasa Rao : లోకేష్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. విజయవాడలో యాత్ర చేసేటప్పుడు జాగ్రత్త.. వెల్లంపల్లి ఘాటు వ్యాఖ్యలు..
ప్రెస్ మీట్ లో వెల్లంపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ని హెచ్చరించారు కూడా.
- Author : News Desk
Date : 19-08-2023 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
నారా లోకేష్(Nara Lokesh) గత కొన్నాళ్లుగా యువగళం(Yuva Galam) పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యువగళం పాదయాత్ర ఎన్టీఆర్ కృష్ణా(NTR Kriashna) జిల్లాలో సాగుతుంది. విజయవాడలో(Vijayawada) పాదయాత్రతో ఎంట్రీ ఇస్తున్నారు. ఇలాంటి సందర్భంలో లోకేష్ పాదయాత్రపై వైసీపీ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో పలువురు టీడీపీ శ్రేణులు వైసీపీలో చేరారు. వైసీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు(Vellampalli Srinivasa Rao).
అనంతరం ప్రెస్ మీట్ లో వెల్లంపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ని హెచ్చరించారు కూడా.
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జగన్ సంక్షేమ పధకాలు, అభివృద్ధి చూసి టీడీపీ నుంచి వైసీపీలో చేరుతున్నారు. లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో అర్ధం కావడం లేదు. విజయవాడలో లోకేష్ కి ప్రజాధరణ లేకపోవడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి జనాలను పాదయాత్రకు రప్పించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు బెజవాడకు ఏం చేశారో చెప్పాలి. మా హయాంలో జగన్ ఏం ఇచ్చారో మేం చెప్పగలం. దమ్మూ, ధైర్యం ఉంటే లోకేష్ నా మీద విజయవాడ పశ్చిమలో పోటీ చేయాలి. లోకేష్ గెలిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటా. లేకుంటే టీడీపీని మూసేస్తారా అని అన్నారు.
అలాగే.. జగన్ గేట్లు తెరిస్తే టీడీపీలో ఒక్కరూ ఉండరు. వైసీపీలో ఉన్నవారు ఎవరూ పార్టీని వదిలివెళ్లరు. నారా లోకేష్ విజయవాడలో యాత్ర చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు. విజయవాడ వదిలేలోపు నా సవాల్ ను స్వీకరించు, లేదంటే ఈవినింగ్ వాక్ చేసుకొని వెళ్లిపో. మేం అడ్డుకుంటే లోకేష్ పాదయాత్ర చేసేవారా? విజయవాడ నగరాన్ని పాడు చేయాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. లోకేష్ కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ. అసలు విజయవాడ పశ్చిమ టీడీపీ నాయకుడు ఎవరు? కేశినేని నాని పాదయాత్రలో ఉన్నారా? మమ్మల్ని రెచ్చగొడితే నారా లోకేష్ ఒక్క అడుగు కూడా వేయలేరు. నీ పాదయాత్ర వలన ఒరిగేదేం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలకు లోకేష్ తన పాదయాత్రలో సమాధానం చెప్తారేమో చూడాలి.
Also Read : AP : గ్రామ పంచాయతీ ఉపఎన్నికల ఫలితాలు..సైకిల్ స్పీడ్ పెరిగింది