Sand Mafia : పిఠాపురంలో ఇసుక మాఫియా..గర్జించిన వర్మ
Sand Mafia : పిఠాపురంలో రోజుకు సుమారు 200 లారీలు అక్రమంగా ఇసుక తరలింపుతో పోలీసుల మౌనంపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కొంచెం మట్టి తవ్వితే వారిని స్టేషన్లకు లాక్కెళ్తున్న అధికార యంత్రాంగం, ఇసుక మాఫియాలపై మాత్రం కళ్లుమూసుకుంటుందని విమర్శించారు
- By Sudheer Published Date - 09:32 PM, Sat - 7 June 25

పిఠాపురంలో టీడీపీ నేత వర్మ (Varma) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వేడి పెంచుతున్నాయి. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేసిన వర్మకు ఇప్పటి వరకు ఎలాంటి పదవీ గౌరవం లభించకపోవడంతో ఆయనలో అసంతృప్తి రోజు రోజుకు ఎక్కువుతుంది. ఇటీవల జనసేన ప్లీనరీ సందర్భంగా నాగబాబు (Nagababu) చేసిన వ్యాఖ్యలపై వర్మ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆ మధ్య కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ , ఆ తర్వాత పవన్ పర్యటన (Pawan Tour) లో కనిపించి అందర్నీ కూల్ చేసాడు. ఇక ఇప్పుడు తాజాగా నియోజవర్గంలో జరుగుతున్న ఇసుక మాఫియా (Sand Mafia) ఆగడాలపై బహిరంగంగా విమర్శలు చేసారు.
Sonia Gandhi : సోనియా గాంధీకి అస్వస్థత
పిఠాపురంలో రోజుకు సుమారు 200 లారీలు అక్రమంగా ఇసుక తరలింపుతో పోలీసుల మౌనంపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కొంచెం మట్టి తవ్వితే వారిని స్టేషన్లకు లాక్కెళ్తున్న అధికార యంత్రాంగం, ఇసుక మాఫియాలపై మాత్రం కళ్లుమూసుకుంటుందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఇసుక తవ్వకాలపై హెచ్చరించినా అధికారులు పట్టించుకోవడం లేదని వర్మ మండిపడ్డారు. రెవెన్యూ, పోలీస్ శాఖలు కలిసి ఈ అక్రమాలకు తోడ్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.
Viral : మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను మూడవ అంతస్తు నుంచి వేలాడదీశన భర్త
ఈ విమర్శల నేపథ్యంలో వర్మ టార్గెట్ చేసింది ఎవర్ని అన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీ నేత దొరబాబు జనసేనలో చేరిన తర్వాత ఆయన అనుచరులే ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్మ వ్యాఖ్యలు పార్టీ లోపలున్న అసంతృప్తిని బయటపెడుతున్నాయి. నాలుగు మండలాల్లో దొరబాబు వర్గానికి రెండు పార్టీల సమాన హక్కులు ఇవ్వడాన్ని వర్మ హర్షించడంలేదు. ఈ విమర్శలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనే విషయమై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.