HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ycp Leaders Meet Election Commission Delhi

AP Assembly Elections : పోలింగ్ శాతంపై ఈసీని కలిసిన వైసీపీ బృందం

AP Assembly Elections : ఈ సమావేశం కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానంతో జరిగినదని తెలిపారు. సమావేశంలో ఓటర్ల జాబితా, పోలింగ్ సరళి, ఈవీఎంల వాడకంపై చర్చలు సాగాయి.

  • Author : Sudheer Date : 03-07-2025 - 1:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ycp Ec
Ycp Ec

కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ (YCP) నేతల బృందం ఈ రోజు (గురువారం) కలిశారు. పార్టీ పార్లమెంటరీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ సమావేశం కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానంతో జరిగినదని తెలిపారు. సమావేశంలో ఓటర్ల జాబితా, పోలింగ్ సరళి, ఈవీఎంల వాడకంపై చర్చలు సాగాయి. ముఖ్యంగా 2024 సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలపై ఉన్న అనుమానాలను విపులంగా ప్రస్తావించినట్లు వెల్లడించారు. వివిధ నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్లను వివి ప్యాట్‌ల (VVPAT) తో పోల్చి చూడాలన్న డిమాండ్‌ను ఈసీ ఎదుట ఉంచినట్లు తెలిపారు.

MLC Kavitha : 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు వద్దు : ఎమ్మెల్సీ కవిత

సాయంత్రం 6 గంటల తర్వాత ఏపీలో భారీగా ఓట్లు పోలైన విషయంపై అనుమానాలు ఉన్నాయని , ఈ సమయంలో దాదాపు 50 లక్షల ఓట్లు వేసినట్టు నమోదైందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. విజయనగరం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈవీఎం, వివి ప్యాట్‌ల మధ్య పోలికను కోరినప్పటికీ, ఈసీ నిరాకరించిందని విమర్శించారు. అంతేగాక పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను విడుదల చేయాలని అడిగినప్పటికీ ఎన్నికల సంఘం తిరస్కరించిందని చెప్పారు. ఈ వ్యవహారమంతా పారదర్శకత లేకుండా జరిగిందని ఆరోపించారు.

HHVM Trailer : అదిరిపోయిన హరిహర వీరమల్లు ట్రైలర్ ..ఫ్యాన్స్ కు పూనకాలే

రాయచోటిలో ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని పేర్కొంటూ, బీహార్‌లో చేసిన విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా స్పెషల్ ఇంటెన్సిఫైడ్ రివిజన్ (Special Intensive Revision) చేయాలని కోరినట్లు తెలిపారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ బూత్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు వేర్వేరు ఓట్ల నిక్షేపం జరిగిందని ఆరోపించారు. ఈవీఎంలలో అనేక లోపాలు ఉన్నందున, అభివృద్ధి చెందిన దేశాల తరహాలో భారత్‌లో కూడా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలన్నది తమ డిమాండుగా చెప్పారు. తాము ఎన్‌డీఏలో గానీ, ఇండియా కూటమిలో గానీ లేమని, తమ నేత జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ అంశాలను ఈసీ ఎదుట వివరించినట్లు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap assembly elections
  • delhi
  • ec
  • ycp

Related News

Sarpanch Election Updates I

Sarpanch Elections Updates in AP : ఏపీలో సర్పంచ్ ఎన్నికలు

ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగడం అసాధ్యమని స్పష్టమవుతోంది. బీసీ రిజర్వేషన్ల కమిషన్ నివేదిక అందిన తర్వాతే ప్రభుత్వం వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తుంది, ఆపై ఎన్నికల సంఘం తుది నోటిఫికేషన్ విడుదల చేస్తుంది

    Latest News

    • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

    • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

    • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

    • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

    • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

    Trending News

      • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

      • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

      • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

      • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

      • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd