Pawan : ఏపి డిప్యూటీ సీఎంతో యూఎస్ కాన్సుల్ జనరల్ భేటి
ఉప ముఖ్యంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్‌కు అభినందనలు తెలిపిన జెన్పిఫర్.
- By Latha Suma Published Date - 02:52 PM, Tue - 30 July 24

Pawan Kalyan: మంగళగిరిలోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసంలో ఈరోజు ఉదయం యూ.ఎస్. కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్(U.S. Consul General Jennifer Larson) మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌కు అభినందనలు తెలియచేసి.. జ్ఞాపిక అందచేశారు యూఎస్ కాన్సల్ జనరల్.. ఇక ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ టీమ్‌ను సత్కరించారు పవన్.. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో.. ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు.. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని.. పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక, మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని వెల్లడించిన పవన్ కల్యాణ్.. వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్లేవారికీ తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని కోరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇక, పర్యావరణహితమైన కార్యక్రమాలకు ప్రోత్సాహం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూ.ఎస్. కాన్సల్ పొలిటికల్, ఎకనామిక్స్ విభాగం చీఫ్ ఫ్రాంక్ టాలుటో, ఆ విభాగం ప్రతినిధులు శ్రీమాలి కారే, సిబప్రసాద్ త్రిపాఠి పాల్గొన్నారు. కాగా, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుసగా తన శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న పవన్ కల్యాణ్.. కీలక ఆదేశాలు జారీ చేస్తున్న విషయం విదితమే. గత ప్రభుత్వ హయాంలో ఆయా శాఖల్లో జరిగిన అవకతవకాలపై పవన్ కల్యాణ్ ఆరా తీస్తూ వస్తున్నారు.
Read Also: Nirbhaya Incident : కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం..