Nirbhaya Incident : కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం..
హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్ (Private bus)లో ఓ మహిళ (Woman) నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళ్తుంది. ఈ బస్‌లో కృష్ణ, సిద్దయ్య ఇద్దరు డ్రైవర్లుగా ఉన్నారు. బస్సులో వేరే ప్రయాణికులు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన డ్రైవర్లు బస్సు అద్దాలను క్లోజ్ చేశారు.
- By Sudheer Published Date - 02:37 PM, Tue - 30 July 24

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రోజు రోజుకు అత్యాచారాలు (Rapes) , హత్యలు (Murders) , నేరాలు (Crime) పెరిగిపోతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లో పట్టపగలే నరకడాలు , అత్యాచారాలు చేయడం ఎక్కువయ్యాయి. దీంతో నగరవాసులు భయం భయంగా బ్రతుకుతున్నారు. ముఖ్యంగా ఒంటరి మహిళకు రాష్ట్రంలో రక్షణ లేదని పెద్ద ఎత్తున ప్రతి పక్ష పార్టీలు , మహిళ సంఘాలు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలకు ఆద్యం పోస్తూ..ప్రతి రోజు ఏదో ఒక ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ నిర్భయ తరహాలో తెలంగాణలో ఘటన జరిగింది. కదులుతున్న బస్సు లో మహిళ నోట్లో గుడ్డలు కుక్కి..డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్ (Private bus)లో ఓ మహిళ (Woman) నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళ్తుంది. ఈ బస్‌లో కృష్ణ, సిద్దయ్య ఇద్దరు డ్రైవర్లుగా ఉన్నారు. బస్సులో వేరే ప్రయాణికులు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన డ్రైవర్లు బస్సు అద్దాలను క్లోజ్ చేశారు. ఆ తర్వాత సిద్దయ్య బస్సు నడుపుతుండగా కృష్ణ మహిళ నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. బాధిత మహిళ వెంటనే డయల్ 100 నంబర్‌కు కాల్ చేసి తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు బస్సును ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసులు సిద్దయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమచారం. మరో డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన కు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు తెలియజేయనున్నారు.
ఇదిలా ఉండగానే వనస్థలిపురంలోనూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జాబ్ చేసే యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. హోటల్‌కు తీసుకెళ్లి మద్యం తాగి ఆమెపై అత్యాచారం చేసినట్లు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒకే రోజు రెండు అత్యాచార ఘటనలు వెలుగులోకి రావడం తో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Read Also : J&K’s Poonch: జమ్మూలోని పూంచ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల సంచారం, అలర్ట్ అయిన బలగాలు