HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Upgradation Of 300 Head Constable Posts In Apsp

APSP: ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్

  • Author : Vamsi Chowdary Korata Date : 28-03-2026 - 10:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Police Recruitment
Ap Police Recruitment

APSP Head Constable  ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీఎస్పీలోని 300 హెడ్ కానిస్టేబుల్ (హెచ్‌సీ) పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఆర్ఎస్ఐ) పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తూ హోం శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెం. 62ను విడుదల చేసింది.

ప్రభుత్వ నిర్ణయంతో 8 ఏపీఎస్పీ బెటాలియన్ల పరిధిలో ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. అప్‌గ్రేడ్ చేసిన 300 ఏఆర్ఎస్ఐ పోస్టులకు బదులుగా, అంతే సంఖ్యలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కర్నూలు (2వ బెటాలియన్), కాకినాడ (3వ), విజయనగరం (5వ), మంగళగిరి (6వ) బెటాలియన్లలో ఒక్కొక్కదానికి 42 చొప్పున పోస్టులను కేటాయించారు. అలాగే, 9, 11, 14, 16వ బెటాలియన్లకు ఒక్కో బెటాలియన్‌కు 33 చొప్పున పోస్టులను అప్‌గ్రేడ్ చేశారు.

రాష్ట్ర డీజీపీ 2025 జనవరి 31న పంపిన ప్రతిపాదనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనకు 2026 మార్చి 14న రాష్ట్ర కేబినెట్, మార్చి 26న ఆర్థిక శాఖ ఆమోదం తెలిపాయి. తాజాగా హోం శాఖ తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంతో ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్ అవకాశాలు మెరుగుపడనున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh Special Police
  • AP Government Orders
  • ap police
  • APSP
  • APSP Head Constable
  • ARSIs
  • head constable
  • kakinada
  • kurnool
  • Police Promotions

Related News

    Latest News

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

    • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

    Trending News

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

      • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

      • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

      • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

      • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd