AP Gold Mine : అమ్మకానికి 10 బంగారు గనులు..ఈ నెలలోనే వేలం..!!
GDPలో మైనింగ్ రంగం వాటాపెంచాలని నిర్ణయించిన కేంద్ర సర్కార్...దేశవ్యాప్తంగా ఉన్న 13 బంగారు గనులను విక్రయించాలని నిర్ణయించింది.
- By hashtagu Published Date - 11:17 AM, Mon - 15 August 22

GDPలో మైనింగ్ రంగం వాటాపెంచాలని నిర్ణయించిన కేంద్ర సర్కార్…దేశవ్యాప్తంగా ఉన్న 13 బంగారు గనులను విక్రయించాలని నిర్ణయించింది. ప్రభుత్వం విక్రయించనున్న గనుల్లో ఒక్క ఏపీలోనే పది గనులు ఉండగా…మిగతావి మూడు యూపీలో ఉన్నాయి. గనుల కొనుగోలుకు సంబంధించిన ఆసక్తిగల వారి నుంచి టెండర్లు ఆహ్వానిస్తూ మార్చి 21న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
2015లో గనుల చట్టాన్ని సవరించడం ద్వారా గనుల వేలం ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. దీనిలో భాగంగానే 199 మినరల్ బ్లాక్ లు వేలం వేశాయి. గత ఆర్థిక సంవత్సరంలోనూ 45 మినరల్ బ్లాక్స్ విక్రయించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు 13 బంగారు గనులను విక్రయించడం ద్వారా GDPలో మైనింగ్ రంగం వాటా పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో విక్రయించనున్న గనుల్లో
1.రామగిరి నార్త బ్లాక్,
2. బొకసంపల్ి నార్త్ బ్లాక్
3. బొకసంపల్లి సౌత్ బ్లాక్
4. జవకుల ఏ
5. జవకుల బి
6. జవకుల సి
7.జవకుల డి
8. జవకుల ఒ
9 జవకుల ఎఫ్
వీటిలో ఐదు గనులకు ఈ నెల 26న మిగతావాటికి 29న వేలం నిర్వహించనున్నారు. కాగా యూపీలోని 3 గనులు, సోనాపహాడి బ్లాక్, సోనాభద్రలోని ధ్రువ బైదానంద్ బ్లాక్ ల కోసం వేల నిర్వహించనున్నప్పటికీ ఎప్పుడు వేలం వేస్తారన్న తేదీ మాత్రం ఇంకా వెల్లడించలేదు.